For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs IRE: అందుకే సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్‌ను తీసుకోలేదు: రోహిత్ శర్మ

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఈ టోర్నీ కోసం మేం అన్ని విధాలా సన్నదమయ్యాం. ఈ కొత్త పరిస్థితుల్లో మమ్మల్ని మేం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రొఫెషనల్స్‌గా ఈ సవాళ్లు మాకు కొత్త కాదు. ఇలాంటి పిచ్‌లపై మేం గతంలో కూడా ఆడాం. ఎలా ఆడాలో తెలుసు. ఈ వికెట్ భిన్నంగా ఉండొచ్చు.

Rohit Sharma Reveals The Reason Why Sanju Samson And Kuldeep Yadav Not Playing IND vs IRE T20 WC Match

పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా చెప్పలేం. కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్ ఈ మ్యాచ్‌ ఆడటం లేదు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే వారికి అవకాశం దక్కలేదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. స్లో వికెట్ కావడంతో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న అక్షర్ పటేల్‌కు తుది జట్టులో చోటు దక్కింది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయనుండటంతో యశస్వి జైస్వాల్‌‌కు అవకాశం దక్కలేదు. వీలైనంత త్వరగా పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామని ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ తెలిపాడు. 'మేం మంచి ప్రిపరేషన్స్‌తో వచ్చాం. ఇటీవలే నెదర్లాండ్స్‌లో ట్రై సిరీస్ ఆడాం. మాకు జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. వాళ్లంతా ఈ రోజు సత్తా చాటాలనుకుంటున్నారు. వీలైనంత త్వరగా పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం'అని పాల్ స్టిర్లింగ్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), ఆండ్రూ బాల్బిరిన్, లోర్కాన్ టక్కర్(కీపర్), హారీ టెక్టర్, కర్టీస్ కాంఫెర్, జార్జ్ డాక్‌రెల్, గారెత్ డెలనీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, జోషువా లిటిల్, బెంజ‌మిన్ వైట్

Story first published: Wednesday, June 5, 2024, 20:00 [IST]
Other articles published on Jun 5, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+