For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే రిషభ్ పంత్‌ను పక్కన పెట్టాం: రోహిత్ శర్మ

 Rohit Sharma reveals the reason why Rishabh Pant not playing in 1st ODI against Bangladesh

ఢాకా: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌‌ గాయపడటంతో అతన్ని పక్కనపెట్టిన టీమ్‌మేనేజ్‌మెంట్ యువ పేసర్ కుల్దీప్ సేన్‌, స్పిన్ ఆల్‌రౌండర్ షెహ్‌బాజ్‌లకు అవకాశం ఇచ్చింది. దాంతో కుల్దీప్ సేన్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగిన రోహిత్ సేన.. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌లను ఎంచుకుంది. ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

గాయాలతో స్టార్ ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలోనే నలుగురు ఆల్‌రౌండర్లను తీసుకున్నామని రోహిత్ శర్మ టాస్ సందర్భంగా స్పష్టం చేశాడు. 'నిజాయితీగా చెప్పాలంటే పిచ్ కండిషన్స్‌పై నాకు క్లారిటీ లేదు. కాస్త మాయిశ్చర్ ఉండటంతో ముందుగా బౌలింగ్ తీసుకోవాలనుకున్నా. జట్టులో ఆటగాళ్ల గాయాలు, ఊహించని సమస్యలతో నలుగురు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగుతున్నాం. వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షెహ్‌బాజ్ అహ్మద్, దీపక్ చాహర్‌ జట్టులోకి వచ్చారు. కుల్దీప్ సేన్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు.

నాతో పాటు శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ అప్‌ది ఆర్డర్‌లో ఆడనున్నారు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు. న్యూజిలాండ్‌లో ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లో మా కుర్రాళ్లు అద్భుతంగా పోరాడారు. కొందరైతే అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వరల్డ్ కప్‌కు చాలా సమయం ఉంది. దాని గురించి ఆలోచించడం లేదు. మాకు ఉన్న వనరులను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపైనే ఫోకస్ పెట్టాం.'అని రోహిత్ తెలిపాడు.

ప్రాక్టీస్‌లో రిషభ్ పంత్ గాయపడ్డాడని, మెడికల్ టీమ్ సూచనలతో అతన్ని వన్డే సిరీస్‌ నుంచి తప్పించినట్లు బీసీసీఐ పేర్కొంది. టెస్ట్ సిరీస్ వరకు అతను అందుబాటులోకి వస్తాడని స్పష్టం చేసింది. పంత్‌కు రిప్లేస్‌మెంట్‌గా ఎవరి పేరు ప్రకటించలేదు. గాయంతో ఇబ్బంది పడుతున్న అక్షర్ పటేల్ కూడా తొలి వన్డే సెలెక్షన్‌కు అందుబాటులో లేడని బీసీసీఐ పేర్కొంది. దాంతో షెహ్‌బాజ్ అహ్మద్‌కు అవకాశం దక్కింది.

ఇప్పటికే ఇషాన్ కిషన్ జట్టులో ఉండగా.. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా జట్టుకు సేవలందించనున్నాడు. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సైతం గాయంతో తప్పుకోవడంతో ఉమ్రాన్ మాలిక్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, షెహ్‌బాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్

బంగ్లాదేశ్: లిటన్ దాస్(కెప్టెన్), అనముల్ హక్, నజ్ముల్ హోస్సెన్ షాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(కీపర్), మహ్మదుల్లా, అఫిఫ్ హోస్సెన్, మెహిదీ హసన్ మీర్జా, హసన్ మహముద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఎబాడట్ హొస్సెన్

Story first published: Sunday, December 4, 2022, 11:59 [IST]
Other articles published on Dec 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+