Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే అశ్విన్‌ను తీసుకున్నాం: రోహిత్ శర్మ

ముంబై: అనుభవజ్ఞుడనే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. గతేడాదిగా అతను వైట్ బాల్ క్రికెట్ ఆడకపోయినా.. దేశవాళీతో పాటు టెస్ట్‌ క్రికెట్‌లో అదరగొట్టాడని గుర్తు చేశాడు.

ఆసియాకప్ 2023 టైటిల్ గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా మరో ఆసక్తికర సిరీస్‌కు సిద్దమైంది. వన్డే ప్రపంచకప్ ముంగిట పటిష్ట ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

Rohit Sharma Reveals The Reason Why Ravichandran Ashwins Selection For Australia ODI

ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్‌ను తొలి రెండు వన్డేలకు పక్కనపెట్టారు. అతని స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు. తెలుగు తేజం తిలక్ వర్మకు మరోసారి అవకాశమిచ్చారు. తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యాలకు విశ్రాంతినిచ్చారు.

ఈ రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మూడో వన్డేతో రోహిత్ శర్మ తిరిగి సారథ్య బాధ్యతలు అందుకుంటాడు. అతనితో పాటు కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు కూడా రీఎంట్రీ ఇస్తారు. ఫిట్‌నెస్ నిరూపించుకుంటే అక్షర్‌ పటేల్ కూడా మూడో వన్డేకు అందుబాటులోకి వస్తాడు. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ అనంతరం అశ్విన్.. వైట్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

అలాంటిది ఆస్ట్రేలియాతో సిరీస్‌కు అశ్విన్‌ను ఎంపిక చేయడానికి గల కారణం ఏంటని రోహిత్ శర్మ ప్రశ్నించగా సమాధానం చెప్పాడు.'అశ్విన్ ఎంత అనుభవజ్ఞుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఇప్పటికే 113 వన్డేలు, 9 టెస్ట్‌లు ఆడాడు. అశ్విన్ ఎప్పుడూ మా ప్రణాళికల్లో ఉంటాడు.
అతను మాకు మంచి ఎంపిక. గత కొంత కాలంగా వన్డే ఫార్మాట్ ఆడకపోయినా.. దేశవాళీతో పాటు టెస్ట్ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు అతను మంచి అవకాశం. అతను ఏ స్థాయిలో రాణిస్తున్నాడనేది మాకు తెలియనుంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, September 19, 2023, 15:14 [IST]
Other articles published on Sep 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+