Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే రవి బిష్ణోయ్‌ని పక్కనపెట్టాం: రోహిత్ శర్మ

Rohit Sharma reveals the reason

సెయింట్ కిట్స్: భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అనివార్య కారణాల వల్ల ఈ మ్యాచ్‌కు మూడు గంటలు ఆలస్యమైంది. టీమ్ లగేజి రాకపోవడంతో మ్యాచ్ ఆలస్యం అయిందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఎక్స్‌ట్రా పేసర్‌తో ఆడుతోంది. రవి బిష్ణోయ్ స్థానంలో పేసర్ ఆవేశ్ ఖాన్ అవకాశం దక్కించుకున్నాడు.

అయితే మైదాన పరిస్థితుల కారణంగానే ఈ మార్పు చేశామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. గత మ్యాచ్‌లో పిచ్ బాగా రీడ్ చేశామని, దాంతోనే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగామని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో అది సరైన నిర్ణయమని పేర్కొన్నాడు. అయితే తాజా మ్యాచ్‌ గ్రౌండ్ డైమన్షన్స్ వేరని, ఎక్స్‌ట్రా పేసర్ అవసరమని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే బిష్ణోయ్ దూరమయ్యాడని, అవేశ్ ఖాన్ బరిలోకి దిగుతున్నాడని చెప్పాడు. బిష్ణోయ్ దూరమవడం దురదృష్టమే అయినప్పటీకీ జట్టు అవసరాల దృష్ట్యానే ఆటగాళ్ల ఎంపిక ఉంటుందని రోహిత్ స్పష్టం చేశాడు.

తొలి మ్యాచ్‌లో తాము ఆడిన విధానం అద్భుతమని చెప్పిన రోహిత్.. ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేశామన్నాడు. ఇప్పుడు మరో అవకాశం తమ ముందట ఉందని, అదే ప్రదర్శనను రిపీట్ చేసి విజయం సాధించాలనుకుంటున్నామని చెప్పాడు. ఓపెనింగ్ మార్పులపై స్పందిస్తూ.. జట్టులోని ఆటగాళ్లు ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్దంగా ఉండాలని తాము భావిస్తున్నామని చెప్పాడు. పరిస్థితులకు తగ్గట్లు ఎక్కడ బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన చేసేందుకు రెడీగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు.

వికెట్ బౌలింగ్‌కు అనుకూలంగా కనిపిస్తుందని అందుకే ఫీల్డింగ్ తీసుకున్నానని విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో తమ అనుభవాన్ని ఉపయోగిస్తామని చెప్పాడు. గత మ్యాచ్‌ను మరిచి తమ విధాన్ని కొనసాగించాలనుకుంటున్నామని చెప్పిన పూరన్.. తమ ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయడంపై ఫోకస్ పెట్టామన్నాడు. జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన పూరన్.. కీమో పాల్, బ్రూక్స్ ఉద్వాసనకు గురయ్యారని చెప్పాడు.

తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్

వెస్టిండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్(కీపర్), రోవ్‌మన్ పోవెల్, షిమ్రన్ హెట్‌మైర్, డేవన్ థామస్, జాసన్ హోల్డర్, అకీల్ హోస్సెన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్

Story first published: Monday, August 1, 2022, 23:04 [IST]
Other articles published on Aug 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+