Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: అందుకే జట్టును మార్చలేదు: రోహిత్ శర్మ

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్‌తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హోస్సెన్ షాంటో అన్నాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. భారత్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసే ప్రయత్నం చేస్తాం.

అదే మా ప్రణాళిక. ఇక్కడి పిచ్ కండిషన్స్‌ మాకు తెలుసు. గాలి కూడా ప్రభావం చూపనుంది. పిచ్ చూడటానికి బాగుంది. ఈ వికెట్‌పై 150-160 పరుగులు చేస్తే గెలవచ్చు. మేం తుది జట్టులో ఒకమార్పు చేశాం. టస్కిన్ అహ్మద్‌పై వేటు వేసాం.'అని నజ్ముల్ హొస్సేన్ షాంటో తెలిపాడు.

Rohit Sharma reveals the reason why India playing the same team vs Bangladesh in T20 WC 2024

మరోవైపు టాస్ గెలిచినా తాము బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. పిచ్ చూడటానికి బాగుంది. సూర్యుడు వచ్చేదానిపైనే పిచ్ కండిషన్స్ ఆధారపడి ఉన్నాయి. ఎండ తగిలితే పిచ్ స్లోగా మారనుంది. వీలైనంత త్వరగా పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోవాల్సి ఉంది.

మేం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం. విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించాలనుకుంటున్నాం. ఎక్కువగా ఆలోచించకుండా పరిస్థితులకు తగ్గట్లు ఆడటం చాలా ముఖ్యం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

బంగ్లాదేశ్: టన్‌జిద్ హసన్, లిటన్ దాస్(కీపర్), నజ్ముల్ హొస్సేన్ షాంటో(కెప్టెన్), టౌహిడ్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషద్ హొస్సెన్, మెహ్‌దీ హసన్, టంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా

Story first published: Saturday, June 22, 2024, 19:57 [IST]
Other articles published on Jun 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+