Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే మూడు మార్పులు చేశాం: రోహిత్ శర్మ

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ముందుగా బౌలింగ్ చేసినందుకు ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయాలనుకుంటానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ టాస్ గెలవడం విశేషం.

ఈ మ్యాచ్‌లో మూడు మార్పులు చేశామని చెప్పిన రోహిత్ శర్మ.. సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్‌లు జట్టులోకి వచ్చినట్లు చెప్పాడు. విభిన్నమైన టీమ్ కాంబినేషన్‌‌ను ప్రయత్నించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలపాడు.

Rohit Sharma Reveals The Reason Why India 3 Changes in 3rd T20I vs Afghanistan

'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. తొలి రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసినందుకు ఈ రోజు బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ నిర్ణయం వెనుక వికెట్‌తో ఎలాంటి సంబంధం లేదు. విభిన్నమైన కాంబినేషన్స్ ప్రయత్నించాలనుకుంటున్నాం. ఈ క్రమంలోనే కొందరికి అవకాశాలు ఇవ్వాలనుకున్నాం.

ఇప్పటికే ఈ సిరీస్‌లో మేం కొన్ని విషయాలను టిక్ చేశాం. కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ఈ మ్యాచ్‌ను వాడుకుంటున్నాం. జట్టులో మూడు మార్పులు చేశాం. సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి రాగా.. అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లు ఉద్వాసనకు గురయ్యారు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని అఫ్గానిస్థాన్ కెప్టెన్ ఇబ్రహీం జడ్రాన్ అన్నాడు. ఈ సిరీస్‌లో ఓడినా తమకు కొన్ని సానుకూలంశాలు లభించాయని చెప్పాడు. తాము కూడా మూడు మార్పులు చేశామని తెలిపాడు.

తుది జట్లు:
అఫ్గానిస్థాన్: రెహ్మానుల్లా గుర్భాజ్, ఇబ్రహీమ్ జడ్రాన్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమార్జాయ్, మహమ్మద్ నబీ, నజిబుల్లా జడ్రాన్, కరీమ్ జనత్, షరఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహమ్మద్ సలీమ్ షఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్

భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, సంజూ శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్.

Story first published: Wednesday, January 17, 2024, 19:11 [IST]
Other articles published on Jan 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+