Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే అశ్విన్, హర్షిత్ రాణాను తప్పించాం: రోహిత్ శర్మ

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. కండిషన్స్‌తో పాటు పిచ్‌పై గ్రాస్ ఉండటంతో ముందుగా బౌలింగ్ ఎంచుకున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.

బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. తమ జట్టు అనుసరించబోయే వ్యూహాలను వివరించాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. కొంచెం ఓవర్‌కాస్ట్ కండిషన్స్‌ ఉండటంతో పాటు పిచ్‌పై గ్రాస్ కూడా ఉంది. ఈ కండిషన్స్‌ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికే మేం చాలా క్రికెట్ ఆడాం. గత రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన చేశాయి. ఈ మ్యాచ్‌ మాకు చాలా కీలకం.

Rohit Sharma Reveals The Reason Why Harshit Rana and R Ashwin dropped

మాపై ఉన్న అంచనాలను అందుకోవాలనుకుంటున్నాం. మంచి క్రికెట్ ఆడుతాం. విజయవకాశాలను అందిపుచ్చుకోవాలి. గత మ్యాచ్‌లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. అందుకే ఓటమిపాలయ్యాం. ఈ మ్యాచ్ కోసం కుర్రాళ్లంతా సిద్దంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆడుదామా? అనే ఉత్సాహంతో ఉన్నారు.

మ్యాచ్ సాగుతున్నా కొద్దీ ఈ వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. తుది జట్టులో మేం రెండు మార్పులు చేశాం. అశ్విన్, హర్షిత్ రాణా స్థానాల్లో రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చారు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఈ మార్పులు చేశాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్‌ ఎంచుకునేవాళ్లమని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. 'మేం కూడా బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నాం. ఇప్పటి వరకు సిరీస్ అద్భుతంగా సాగింది. గత వారం మాకు చాలా సంతోషంగా గడిచింది.

ప్రతీ ఒక్కరు ఈ సిరీస్ మూడ్‌లోకి వచ్చారు. ఈ మ్యాచ్‌ కోసం మేం బాగా సన్నదమయ్యాం. అడిలైడ్‌ టెస్ట్‌ను త్వరగా ముగించడం మాకు కలిసొచ్చింది. ఇక్కడకు వచ్చి ప్రిపేర్ అయ్యేందుకు సమయం దొరికింది. జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం. స్కాట్ బోలాండ్ స్థానంలో జోష్ హజెల్ వుడ్ జట్టులోకి వచ్చాడు.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హజెల్ వుడ్

భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

Story first published: Saturday, December 14, 2024, 6:26 [IST]
Other articles published on Dec 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+