
దుబాయ్: ఆసియాకప్ 2022లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హంగ్‌కాంగ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓమన్ వేదికగా జరిగిన ఆసియాకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో తాము అద్భుతంగా చేజింగ్ చేసామని ఆ జట్టు కెప్టెన్ నిజకత్ ఖాన్ తెలిపాడు. అదే జోరును ప్రధాన టోర్నీలో కొనసాగించాలనుకుంటున్నామని, ఈ నేపథ్యంలోనే ఫీల్డింగ్ తీసుకున్నామని చెప్పాడు. గతంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో తాము గట్టి పోటీనిచ్చామని చెప్పిన నిజకత్.. ఆ మ్యాచ్‌లో కొన్ని తప్పిదాలను చేసి మూల్యం చెల్లించుకున్నామని చెప్పాడు. ఆ తప్పిదాలను సరిదిద్దుకొని తాజా మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నామని పేర్కొన్నాడు. యూఏఈతో ఆడిన జట్టుతోనే ఆడుతున్నామని తెలిపాడు.
ఇక టీమిండియా ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. గత మ్యాచ్ విన్నర్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టిన రోహిత్ సేన.. అతని స్థానంలో రిషభ్ పంత్‌కు అవకాశం ఇచ్చారు. కీలకమైన హార్దిక్‌కు రెస్ట్ ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ తీసుకునేవాళ్లమని, అయితే ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపాడు.
పిచ్‌పై గడ్డి ఉందని, పేస్‌కు అనుకూలించే అవకాశం ఉన్నా భారీ స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు. ప్రత్యర్థితో పనిలేకుండా తమ ఆట తాము ఆడుతామని, జట్టుగా రాణించేందుకు కృషి చేస్తామని చెప్పాడు. తాము బేసిక్స్‌కు కట్టుబడి ఉన్నామని,దాంతోనే పాక్‌పై విజయం దక్కిందని తెలిపాడు.
తుది జట్లు:
హాంగ్‌కాంగ్: నిజకత్ ఖాన్(కెప్టెన్), యాసిమ్ ముర్తాజ, బాబర్ హయత్, కించిత్ షా, అయిజాజ్ ఖాన్, స్కాట్ మెక్‌చిన్, జీషాన్ అలీ, హరూన్ అర్షద్, ఎహ్‌సాన్ ఖాన్, ఆయూష్ షుక్లా, మహమ్మద్ ఘజన్ఫార్
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్