బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. విజయానికి కావాల్సిన బలమైన జట్టును ఎంపిక చేస్తామని చెప్పాడు. వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో గురువారం నుంచి చెన్నై వేదికగా ప్రారంభమయ్యే రెండు టెస్ట్‌ల సిరీస్‌తో టీమిండియా టెస్ట్ సీజన్ ప్రారంభం కానుంది.
ఈ టెస్ట్ సీజన్‌ను ఘనంగా ప్రారంభించడమే తమ లక్ష్యమని రోహిత్ తెలిపాడు. తొలి టెస్ట్ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తుది జట్టు ఎంపిక గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగుతామని చెప్పాడు. బంగ్లాదేశ్‌ను ఏ మాత్రం తేలికగా తీసుకోమని స్పష్టం చేశాడు.

గెలుపే లక్ష్యంగా..
'ప్రధాన ఆటగాళ్లంతా జట్టుకు అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం. మా టెస్ట్ సీజన్‌ను మేం ఘనంగా ప్రారంభించాలనుకుంటున్నాం. విజయం కోసం మేం ఎలా ఆడాలనుకుంటున్నామో.. అందుకు తగినట్లుగానే తుది జట్టును ఎంపిక చేస్తాం. దేశం తరఫున ఆడుతున్నప్పుడు మాకు ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. మేం ప్రతీ గేమ్ గెలవాలనుకుంటున్నాం.
ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లు మాకు ఏ మాత్రం రిహార్సల్ కావు. డబ్ల్యూటీసీ 2025లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ గెలిచి పాయింట్లు సాధించడం మాకు చాలా ముఖ్యం. అందుకే మా టెస్ట్ సీజన్‌ను విజయంతో ప్రారంభించాలనుకుంటున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
కేఎల్ రాహుల్‌కు చోటు ఖాయం..
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు రోహిత్ అండగా నిలిచాడు. అతను నాణ్యమైన టెస్ట్ ప్లేయర్ అంటూ కితాబిచ్చాడు.'ప్రపంచ క్రికెట్‌లో నిలకడగా ఆడే ఆటగాళ్లు అతికొద్ది మంది మాత్రమే. ఇందులో కొంతమందికి ఎలాంటి సమస్యలు లేవు. వారి కెరీర్ సాఫీగా సాగుతోంది. అయితే ప్రతీ ఒక్కరికి కెరీర్‌లో ఒడిదొడుకులు ఉంటాయి.
ముఖ్యమైన విషయం ఏంటంటే.. మన్నల్ని మనం అర్థం చేసుకోవడం, మన నుంచి ఏం ఆశిస్తున్నారు..? జట్టు కోసం ఏం చేయాలనేది తెలుసుకోవాలి.
కేఎల్ రాహుల్ క్లాస్ ప్లేయర్. అతని నైపుణ్యం గురించి ప్రతీ ఒక్కరికి తెలిసిందే. అన్నీ మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చి అత్యుత్తమ ప్రదర్శన రాబడుతామని టీమ్‌మేనేజ్‌మెంట్ నుంచి అతనికి స్పష్టమైన సందేశం ఇచ్చాం. అతనికి ఈ క్లారిటీ ఇవ్వడం చాలా ముఖ్యం.
రాహుల్‌ను తప్పించలేం..
ఇక రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రాహుల్ నిలకడగా ఆడుతున్నాడు. సౌతాఫ్రికాలో శతకం సాధించాడు. గాయంతో తాను ఆడిన చివరి టెస్ట్‌లోనూ 80 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అదే ఫామ్ కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. కేఎల్ రాహుల్ టెస్ట్ ఫార్మాట్ బాగా ఆడగలడు. అతను మరింత మెరుగ్గా రాణిస్తాడని అనుకుంటున్నా. అతను టెస్ట్ క్రికెట్‌లో రాణించలేడని చెప్పడానికి ఒక్క కారణం కూడా నా దగ్గర లేదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. రోహిత్ మాటలను బట్టి చూస్తే తుది జట్టులో రాహుల్‌కు చోటు ఖాయమని అర్థమవుతోంది.