ఇంగ్లండ్‌పై మా విజయ రహస్యం ఇదే: రోహిత్ శర్మ

లండన్: పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేయడంతో పాటు దానికి తగ్గ ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ పెట్టడంతోనే ఇంగ్లండ్‌పై తొలి వన్డేలో భారీ విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఏకపక్షంగా సాగిన తొలి మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. జస్‌ప్రీత్ బుమ్రా(6/19) తన బౌలింగ్‌తో సిక్సర్ కొట్టడంతో ఇంగ్లండ్ ఘోర పరాజయం చవిచూసింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. తమ విజయానికి గల కారణాలను వెల్లడించాడు.

కండిషన్స్ తగ్గట్లు బౌలింగ్..
'మైదాన పరిస్థితులను చూసే మేం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాం. పరిస్థితులను మేం అద్భుతంగా ఉపయోగించుకున్నాం. ఏనాడు కూడా వికెట్ కండిషన్స్ చూసి దిగులు చెందినది లేదు. ఎందుకంటే పరిస్థితులకు తగ్గట్లు ఆడే ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. ఈ వికెట్‌పై సీమ్‌తో పాటు స్వింగ్ ఉందని గ్రహించాం. మా బౌలర్లు కూడా దానిని ఉపయోగించుకుంటూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడుతున్నప్పుడు సరైన ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ పెట్టాలి.

ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ కూడా..
మా బౌలర్లు బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలరని మాకు తెలుసు. దానికి తగ్గట్లు ఫీల్డ్ పెట్టాం. ఇక బ్యాటింగ్‌లో శిఖర్, నేను ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. అతను ఆడిన తొలి బంతి మినహా మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది. చాలా రోజుల తర్వాత ధావన్ వన్డేలు ఆడుతున్నాడు. జట్టు కోసం అతను ఏం చేయగలడో మాకు తెలుసు. చాలా అనుభవమైన ఆటగాడు. గతంలో ఈ తరహా కండిషన్స్‌లో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హుక్ షాట్ ఆడటం చాలా రిస్కీ. దాన్ని నేను అర్థం చేసుకోగలను. అది సరిగ్గా వచ్చినంత కాలం నేను సంతోషంగా ఉంటాను.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు. భారత్ ఇన్నింగ్స్ తొలి బంతికే ధావన్, రోహిత్ శర్మ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

బుమ్రా సిక్సర్.. షమీ తీన్మార్!
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జస్‌ప్రీత్ బుమ్రా (6/19) సంచలన బౌలింగ్‌కు, మహ్మద్ షమీ (3/31) మెరుపులు కూడా తోడవడంతో మొదట ఇంగ్లాండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జోస్ బట్లర్ (30; 32 బంతుల్లో 6×4) టాప్‌స్కోరర్. అనంతరం కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (76 నాటౌట్; 58 బంతుల్లో 7×4, 5×6) చెలరేగడం.. మరో ఓపెనర్ ధావన్ (31 నాటౌట్; 54 బంతుల్లో 4×4) కూడా నిలకడగా ఆడడంతో భారత్ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్టూ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. భారత పేసర్లు విజృంభించిన పిచ్ మీద ఇంగ్లిష్ బౌలర్లను అసలేమాత్రం లెక్క చేయలేదు రోహిత్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications