
సూర్య సెన్సేషనల్..
'ఈ మ్యాచ్‌లో మేం ఓడిపోయినా అద్భుతమైన పోరాటం కనబర్చాం. లక్ష్యాన్ని అధిగమించినంత పని చేశాం. మా పోరాటం పట్ల గర్వపడుతున్నా. సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. గత కొంత కాలంగా అతన్ని నేను చూస్తున్నాను. రోజురోజుకు అతను మెరుగవుతున్నాడు. అతని అమ్ములపొదిలో విస్తృత షాట్స్ ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో అతనికి తిరుగులేదు. అతని సామర్థ్యం గురించి ఎంత మాట్లాడినా తక్కువే.

భారీ లక్ష్యంతో..
ఇక ఇంగ్లండ్ భారీ లక్ష్యంతో మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది. మంచి భాగస్వామ్యంతో మా ముందు భారీ లక్ష్యం ఉంచింది. అయితే ఈ లక్ష్యాన్ని మేం చేదించగలిగినదే. కానీ దురదృష్టవశాత్తు అందుకోలేకపోయాం. అయితే ఈ మ్యాచ్ ద్వారా మేం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మా బౌలింగ్ బెంచ్ బలం తెలిసింది. ప్రతీ గేమ్‌లోనూ మెరుగ్గా ఆడటమే మా లక్ష్యం'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

మలాన్, లివింగ్ స్టోన్ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ (39 బంతుల్లో 77; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), లివింగ్‌స్టోన్ (29 బంతుల్లో 42 నాటౌట్; 4 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులు చేసింది.

సూర్య ప్రతాపానికి ఒక్కరు తోడైనా..
సూర్య కుమార్ యాదవ్ (55 బంతుల్లో 117; 14 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు సెంచరీకి సరైన సహకారం లభించలేదు. శ్రేయస్ అయ్యర్ (28; 2 సిక్స్‌లు)లాంటి మరో స్కోరు ఉంటే భారతే గెలిచేది. ఎందుకంటే మిగతా వారిలో ఇద్దరు మినహా అంతా సింగిల్ డిజిట్‌కే అవుటయ్యారు. ఇంగ్లండ్ పేసర్ రీస్ టోప్లే (3/22) 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు గెల్చుకోగా... భువనేశ్వర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' పురస్కారం లభించింది.


Click it and Unblock the Notifications
