For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెరీర్ ప్రారంభంలో ఆ బౌలర్ల‌తో ఇబ్బంది పడ్డా: రోహిత్

Rohit Sharma reveals Lee & Steyn troubled him during his early days
Rohit Sharma Reveals Lee & Steyn Troubled Him During His Early Days

ముంబై: కెరీర్ ప్రారంభంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్‌లీ, సౌతాఫ్రికా స్టార్ డేల్ స్టెయిన్ బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉండేదని టీమిండియా స్టార్ ఓపెనర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ప్రస్తుతం తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లను ఊచకోత కోస్తున్న ఈ ముంబైకర్ మొదట్లో ఈ ఇద్దరు బౌలర్లు ఎదుర్కోవడం సవాల్‌గా ఉండేదని చెప్పుకొచ్చాడు.

సహచర ఆటగాడు, టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీతో శనివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్ నిర్వహించిన హిట్‌మ్యాన్ పలు ఆసక్తికర విషయాలు వెళ్లడించాడు.

'నేను క్రికెట్‌లో అడుగుపెట్టిన రోజుల్లో బ్రెట్‌లీ తన వేగవంతమైన బౌలింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నాడు. నా అరంగేట్ర వన్డే సిరీస్ కోసం.. నేను ఐర్లాండ్ వెళ్లాను. అక్కడ సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో స్టెయిన్ బౌలింగ్ ఎదుర్కొన్నా. చాలా కష్టంగా అనిపించింది. అప్పట్లో బ్రెట్‌లీ, స్టెయిన్ బౌలింగ్‌ నాకు చాలా నచ్చింది. అలాగే వారిని ఎదుర్కోవడం చాలా కష్టంగా కూడా అనిపించింది. ప్రస్తుత తరంలో మాత్రం కగిసో రబడా అద్భుతమైన బౌలర్. అలాగే జోష్ హజల్ వుడ్ బౌలింగ్ కూడా నాకు చాలా ఇష్టం. వీరు చాలా అద్భుతంగా బంతులు వేస్తారు.'అని రోహిత్ తెలిపాడు.

Rohit Sharma reveals Lee & Steyn troubled him during his early days

ఇక 2017లో శ్రీలంకతో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసే అవకాశం చేజారిందని రోహిత్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 35 బంతుల్లోనే శతకం బాధిన రోహిత్.. 43 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్స్‌లతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. హిట్ మ్యాన్ 11వ ఓవర్లోనే ఔటయ్యాడు. ఇదే విషయాన్ని ఓ అభిమాని ప్రస్తావిస్తూ.. డబుల్ సెంచరీ చేసే అవకాశం చేజారింది కదా?అని ప్రశ్నించాడు. దీనికి హిట్ మ్యాన్ కూడా అంగీకరిస్తూ.. ఆ మ్యాచ్‌లో డబుల్ బాదే చాన్స్ ‌కోల్పోయానని గుర్తు చేసుకున్నాడు.

Rohit Sharma reveals Lee & Steyn troubled him during his early days

'ఆ మ్యాచ్‌‌లో డబుల్ సెంచరీ చేయడానికి మంచి అవకాశం లభించింది. నేను ఔటయ్యే సరికి ఇంకా 9 ఓవర్లు మిగిలే ఉన్నాయి. అందుకే డబుల్ బాదడానికి మంచి చాన్స్ ఉండే. కానీ 35 బంతుల్లో 100 కూడా మంచిదే. నేను దాంతోనే సంతృప్తి చెందుతా'అని ఈ ముంబై క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, May 3, 2020, 12:07 [IST]
Other articles published on May 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+