Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ హీరోయిన్ నా క్రష్: రోహిత్ శర్మ

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తనకు ఇష్టమైన హీరోయిన్ పేరును వెల్లడించాడు. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె తన క్రష్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 2007లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. కెరీర్ ఆరంభంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. 2013 వరకు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. సచిన్ రిటైర్మెంట్ అనంతరం ఓపెనర్‌గా అవకాశం అందుకున్న రోహిత్‌కు తిరుగే లేకుండా పోయింది. గత 18 ఏళ్లుగా భారత జట్టులో కొనసాగుతున్న రోహిత్..టీ20, టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో అక్టోబర్‌లో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఆమె అంటే నాకు పిచ్చి..

ఇటీవలే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో యో యోతో పాటు బ్రాంకో టెస్ట్‌లను రోహిత్ శర్మ క్లియర్ చేశాడు. కెరీర్ ఆరంభంలో(2013) రోహిత్ శర్మ ఫిల్మ్‌ఫేర్ అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్‌లు తన అభిమాన నటులని చెప్పిన రోహిత్ శర్మ.. హీరోయిన్లలో విద్యా బాలన్, దీపికా పడుకొనే నటన అంటే చాలా ఇష్టమని తెలిపాడు.

Rohit Sharma Reveals His Celebrity Crush
Photo Credit: X (twitter)

ఇక కరీనా కపూర్ అంటే తనకు పిచ్చి అని, ఆమె తన క్రష్ అని పేర్కొన్నాడు. సినిమాల్లో నటించే అవకాశం వస్తే.. కరీనా కపూర్‌తో చేస్తానని కూడా తన మనసులోని మాటను వెల్లడించాడు. 'కరీనా కపూర్ చాలా అందంగా ఉంటుంది. ఆమె అంటే నాకు ఎప్పటినుంచో క్రష్ ఉంది. నేను ఆమెకు డైహార్డ్ ఫ్యాన్. ఆమె సినిమాలు అన్నీ చూశాను.'అని తెలిపాడు.

ఆ డైరెక్టర్ హీరోగా ఆఫర్ ఇచ్చాడు

అంతేకాకుండా ఓ యాడ్ షూట్ సందర్భంగా డైరెక్టర్ సినిమా ఆఫర్ చేసిన ఘటనను కూడా రోహిత్ గుర్తు చేసుకున్నాడు. 'ఒకసారి యాడ్ షూటింగ్ చేస్తున్నప్పుడు.. ఆ డైరెక్టర్ నా ఫేస్ చాలా ఫోటోజెనిక్‌గా ఉందని చెప్పాడు. సినిమాల్లో సెట్ అవుతారని తెలిపాడు. నాతో కలిసి సినిమా తీయాలనుందని చెప్పాడు. అయితే నాకు సినిమాలు తీసే సమయం లేదని, నా వ్యక్తిగత పనులకే సమయం దొరకడం లేదన్నాను.

క్రికెట్ తప్పా తాను మరేమి ఆలోచించడం లేదని చెప్పాను. నా కెరీర్ ఆరంభంలోనే ఉందని, భవిష్యత్తులో అవకాశం వస్తే యాక్టింగ్ గురించి ఆలోచిస్తానని బదులిచ్చాను. ఒకవేళ నేను సినిమాలో నటిస్తే కరీనా కపూర్ నా హీరోయిన్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఆమె సినిమాలన్నీ నాకు బాగా నచ్చుతాయి.'అని ఆ ఇంటర్వ్యూలో హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు.

రితికాతో సంసారం..

రోహిత్ శర్మ వ్యక్తిగత జీవితానికి వస్తే.. అతను 2015లో రితికా సజ్దేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. స్పోర్ట్స్ మేనేజర్ అయిన రితికాను మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ దగ్గర పనిచేసే సమయంలో చూసిన హిట్ మ్యాన్.. తొలి చూపులోనే మనసు పారేసుకున్నాడు. ఆ తర్వాత తన మేనేజర్‌గా నియమించుకొని, ప్రపోజ్ చేసి.. కొన్నాళ్లు ప్రేమించి, ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. వీరికి పాప సమైరా, బాబు అహన్ జన్మించారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న రోహిత్.. తన సమయాన్ని పూర్తిగా కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు.

Story first published: Monday, September 1, 2025, 11:16 [IST]
Other articles published on Sep 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+