టీ20 కోసం టెస్టు మ్యాచ్ వదులుకున్న రోహిత్ శర్మ


హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటన ముంగిట భారత ఓపెనర్ రోహిత్ శర్మకి గొప్ప ఉపశమనం లభించింది. పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని న్యూజిలాండ్ 'ఎ'తో నాలుగు రోజుల అనధికారిక టెస్టులో తలపడనున్న భారత్ 'ఎ' జట్టు నుంచి రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. వెస్టిండీస్‌తో వన్డే, టీ20లు ఆడిన రోహిత్ శర్మ.. నవంబరు16 నుంచి భారత్-ఎ జట్టు తరఫున న్యూజిలాండ్ గడ్డపై అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది.

షెడ్యూల్‌ని పరిశీలించిన బీసీసీఐ..
తాజాగా రోహిత్ శర్మ షెడ్యూల్‌ని పరిశీలించిన బీసీసీఐ.. అతడ్ని అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడనున్న జట్టు నుంచి తప్పించి విశ్రాంతినిచ్చింది. దీంతో.. ఆస్ట్రేలియా పర్యటనకి నేరుగా ఈ ఓపెనర్ వెళ్లనున్నాడు. 9 నెలలుగా టెస్టు క్రికెట్‌కి దూరంగా ఉన్న రోహిత్ శర్మని ఇటీవల భారత సెలక్టర్లు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేశారు. దీంతో ఆ సిరీస్ సన్నద్ధతలో భాగంగా భారత్-ఎ జట్టు తరఫున ఆడాలని రోహిత్ ఆశించాడు. కానీ.. తాజాగా ఆ ప్రయత్నాన్ని బీసీసీఐతో చర్చించి విరమించుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ ఎఫెక్ట్: మాస్క్‌లతోనే మ్యాచ్‌లకు సిద్ధమవుతోన్న ప్లేయర్లు

కమిటీని సంప్రదించిన బీసీసీఐ వైద్య బృందం..
‘జట్టు మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీని సంప్రదించిన బీసీసీఐ వైద్య బృందం.. విశ్రాంతి తీసుకోవాలని రోహిత్ శర్మకు సలహా ఇచ్చింది. అతడి పని భారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు' అని బీసీసీఐ ఓ ప్రకటనలో చెప్పింది.

రోహిత్ కాకుండా మిగిలినవారంతా:
రోహిత్‌తో పాటు ‘ఎ' జట్టుకు ఎంపికైన అజింక్య రహానె, మురళీ విజయ్, హనుమ విహారి, పార్థివ్ పటేల్, పృథ్వీ షా మాత్రం న్యూజిలాండ్ ‘ఎ'తో తొలి అనధికార టెస్టులో ఆడతారు. వీళ్లు కూడా ఆసీస్‌లో పర్యటించిన భారత టెస్టు జట్టులో సభ్యులన్న సంగతి తెలిసిందే. నవంబరు 21 నుంచి భారత్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications