దిలీప్ గారు.. మీరు ఒక దిగ్గజం: రోహిత్ శర్మ
టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌పై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. దిలీప్ ఒక దిగ్గజం అంటూ కొనియాడాడు. తెరవెనుక అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి అని ప్రశంసించాడు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా తన ఐదేళ్ల ప్రయాణానికి టీ దిలీప్ ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో శుభదీప్ ఘోష్‌ను బీసీసీఐ నూతన ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది.
హైదరాబాద్‌కు చెందిన టీ దిలీప్ 2021లో టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. తన హయాంలో జట్టులో అద్భుతమైన మార్పు తీసుకొచ్చాడు. ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్‌లో బెస్ట్ ఫీల్డర్ అవార్డ్‌ను ప్రవేశపెట్టి ఆటగాళ్లలో పోటీతత్వాన్ని పెంచాడు.

ఈ ఐదేళ్లలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024, 2026, ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2023, 2025 ట్రోఫీలను భారత్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. వన్డే ప్రపంచకప్ 2023తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2023 ఫైనల్ చేరిన జట్టులోనూ సపోర్ట్ స్టాఫ్‌గా ఉన్నాడు.
ఇక తన ఐదేళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ టీ దిలీప్.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు. తనకు సహకరించిన కోచ్‌లు రాహుల్ ద్రవిడ్, గౌతమ్ గంభీర్‌తో పాటు కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
దిలీప్ నిష్క్రమణపై రోహిత్ శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో స్పందించాడు. 'దిలీప్ గారూ.. మీరు ఒక లెజెండ్. జట్టులో ఒక మాయాజాలాన్ని సృష్టించారు. తెరవెనుక అంకితభావంతో పని చేశారు. మీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు'అని ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత టీమిండియా వరుస పరాజయాలను మూటగట్టుకోవడం, ఫీల్డింగ్ ప్రమాణాలు పడిపోవడంతో టీ దిలీప్‌తో పాటు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే కాంట్రాక్ట్‌లను బీసీసీఐ పొడిగించలేదు. దాంతో దిలీప్ తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిత్ శర్మతో టీ దిలీప్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే దిలీప్ నిష్క్రమణపై రోహిత్ శర్మ స్పందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

