For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా సక్సెస్‌కు మా శ్రీమతిగారే కారణం: రోహిత్ శర్మ

న్యూఢిల్లీ: ప్రతీ మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందని చెబుతుంటారు. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆ మాటనే చెప్పుకొచ్చాడు. తన సక్సెస్ వెనుక కూడా తన సతీమణి రితికా సజ్దే ఉందని తెలిపాడు. తాజాగా బ్యాక్ స్టేజ్ విత్ బోరియా షోలో మాట్లాడిన రోహిత్ శర్మ.. రితికా తన కెరీర్‌లో కీలక పాత్ర పోషించిందన్నాడు. తామిద్దరం ఒకటేనని, భవిష్యత్తులో కూడా ఇలానే ఉండాలని భావిస్తున్నానని చెప్పాడు.

'రితికా నా నెంబర్.1 సపోర్ట్ సిస్టమ్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇన్నాళ్లూ ఆమె నాకు అండగా నిలిచింది. నా పక్కన ఉంటూ నా కష్టాలను పాలు పంచుకుంది. ఆమె నా కెరీర్‌లో ముఖ్య పాత్ర పోషించింది. నేను క్రికెటర్‌గా మరింత ఎదగాలని తపనతో ఎల్లప్పడూ ఉంటుంది. నేను సాధించే ప్రతీ విజయంలో తన పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. మేము ఇద్దరం ఒకటే. మా ఆలోచనలు ఒకేలా ఉంటాయి. నేను విఫలమైతే, ఆమె కూడా విఫలమయినట్లే. నేను విజయం సాధిస్తే, ఆమె కూడా విజయం సాధించినట్లే. భవిష్యత్తులో కూడా మేము ఇలానే ఉండాలనుకుంటున్నా'అని రోహిత్‌ శర్మ తెలిపాడు. ఇక రోహిత్‌ డిసెంబర్ 13, 2015 న రితికను వివాహం చేసుకున్నాడు. వారికి సమైరా పుట్టింది.

ఇక టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎంపిక చేసిన విషయం తెలిిసందే. సౌతాఫ్రికా పర్యటనకు కోసం టెస్ట్ జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ.. రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన కూడా చేసింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ, అజింక్యా రహానే వైస్ కెప్టెన్సీపై వేటు వేసింది.

టీమిండియా వన్డే కెప్టెన్‌ బాధ్యతలు స్వీకరించనున్న రోహిత్ శర్మ.. తన కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. తనకు కోహ్లీ ఎప్పటికీ కెప్టెనేనని, అతని సేవలు భారత జట్టుకు అవసరమన్నాడు. 'విరాట్ కోహ్లీ వంటి నాణ్యమైన ఆటగాళ్లు జట్టుకు ఎంతో అవసరం. టీ20 ఫార్మాట్‌లో 50 ప్లస్ యావరేజ్ అనేది మాములు విషయం కాదు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీ భారత్‌ను గెలిపించాడు. అతని అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కోహ్లీ క్వాలిటీ, బ్యాట్స్‌మన్‌షిప్ టీమ్‌ను మరోస్థాయికి చేర్చుతుంది. ఇప్పటికీ అతను జట్టులో కెప్టెన్‌గానే భావిస్తా. అలాంటి సారథిని కోల్పోవడానికి ఏ కెప్టెన్ కూడా ఇష్టపడడు. జట్టులో అతను ఉండటం ఎంతో అవసరం. ఇక ఆటగాడిగా ఎన్ని సెంచరీలు బాదినా.. పరుగులు చేసినా చాంపియన్‌షిప్ గెలవడమే ముఖ్యం. అయితే టైటిల్ గెలవాలంటే ఒక్కడి వల్ల సాధ్యం కాదు. జట్టుగా రాణించాల్సిందే.'అని హిట్ మ్యాన్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Thursday, December 9, 2021, 20:37 [IST]
Other articles published on Dec 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+