Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఇద్దరికీ మంచి భవిష్యత్తు ఉంది: రోహిత్ శర్మ

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఇద్దరికీ మంచి భవిష్యత్తు ఉందని కొనియాడాడు. అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. శివమ్ దూబే(32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 నాటౌట్), యశస్వి జైస్వాల్(35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. జట్టులోని ప్రతీ ఒక్కరు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని కొనియాడాడు. 150 టీ20లు ఆడటం గొప్పగా ఉందని తెలిపాడు.

Rohit Sharma praises Shivam Dube and Yashasvi Jaiswal after Indias series win vs AFG

'టీ20ల్లో 150 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం గొప్పగా ఉంది. 2007లో మొదలైన సుదీర్ఘ ప్రయాణం. ఈ ఫార్మాట్‌లో నేను గడిపిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. ఈ మ్యాచ్‌లో మేం ఏం చేయాలనుకున్నాం అనేదానిపై క్లారిటీతో ఉన్నాం. ప్రతీ ఒక్కరికి వారి బాధ్యతల గురించి స్పష్టంగా తెలియజేశాం. ఈ తరహా ప్రదర్శనలు చేసినప్పుడు గర్వపడవచ్చు.

ప్రతీ ఒక్కరు తమ రోల్స్‌కు తగ్గట్లు ఆడి ఇలాంటి ఫలితాలు సాధిస్తే జట్టుకు తిరుగుండదు. గత రెండు మ్యాచ్‌ల్లో మేం చాలా విషయాలను మెరుగుపరుచుకున్నాం. జైస్వాల్, శివమ్ దూబే గత రెండేళ్లుగా ఎంతో కష్టపడ్డారు. జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌తో పాటు టీ20లు ఆడుతున్నాడు. తన సత్తా ఏంటో చూపించాడు. అపారమైన ప్రతిభ అతని సొంతం. అంతేకాకుండా అతని దగ్గర అసాధారణమైన షాట్స్ ఉన్నాయి.

దూబే బిగ్ ప్లేయర్. చాలా పవర్‌ఫుల్ బ్యాటర్. స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కోగలడు. టీమ్‌మేనేజ్‌మెంట్ అతనికి ఇచ్చిన రోల్ కూడా అదే. అతను వరుసగా రెండు అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వితో పాటు దూబేకు మంచి భవిష్యత్తు ఉంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. ఇబ్రహీమ్ జడ్రాన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/32) తీన్మార్ బౌలింగ్‌తో రఫ్ఫాడించగా.. రవి బిష్ణోయ్(2/39), అక్షర్ పటేల్(2/17) రెండేసి వికెట్లతో అఫ్గానిస్థాన్ పతనాన్ని శాసించారు. శివమ్ దూబేకు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా దూబే, యశస్వి సిక్సర్ల మోతకు ఓవర్లలో 4 వికెట్లకు పరుగులు చేసి అలవోక విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ(16 బంతుల్లో 5 ఫోర్లతో 29), రింకూ సింగ్(9 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.

Story first published: Monday, January 15, 2024, 7:03 [IST]
Other articles published on Jan 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+