
ముంబై: టీమిండియా స్టార్ ఓపెనర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ క్వారంటైన్ సమయాన్ని తనదైన శైలిలో ఆస్వాదిస్తున్నాడు. అటు కూతురితో ఆడుతూ.. ఇటు కిచెన్‌లో సతీమణి రితికాకు సాయం చేస్తూ.. మరోవైపు ఇన్‌స్టా లైవ్ సెషన్స్ నిర్వహిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. లైవ్ సెషన్స్‌లో ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ అభిమానులకు కావాల్సిన మాజానిస్తున్నాడు. అలాగే ఇంటిలోనే వర్కౌట్స్ చేస్తూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నాడు.
ఇక ఈ క్వారంటైన్ సమయంలో తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నాడు. ఇక కూతురు సమైరా అంటే తనకు ఎంత ఇష్టమో ఈ స్టార్ ఓపెనర్ ఇప్పటికే చాలాసార్లు తెలియజేశాడు. ఆదివారం మరోసారి అద్భుతమైన సందేశంతో హిట్‌మ్యాన్ కూతురు పట్ల ప్రేమను చాటాడు. ఇంటి గార్డెన్‌లో కూతురి చేయి పట్టుకొని నడుస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రోహిత్... 'ఆ చిన్న వేలు పట్టుకొని ఆమె(సమైరా) రోజు గురించి ఆమెనే అడగడం కంటే గొప్ప ఫీలింగ్ ఏమీ ఉండదు. దిగులు చెందుకు రితికా.. నీ వేలు పట్టుకొని నీ రోజు గురించి అడగడం కూడా నాకు ఇష్టమే'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.
ఇటీవల హర్భజన్ సింగ్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న హిట్‌మ్యాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా ధోనీ భవితవ్యం గురించి అడిగిన అభిమానులపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. వరల్డ్‌కప్ తర్వాత నుంచి మహీ గురించి తనకు తెలియదని, మీకు అంతగా కావాలంటే... రాంచీలో ఉన్న ధోనీ దగ్గరకు వెళ్లి అడగండని సూచించాడు. అయితే లాక్‌డౌన్ ముగిసిన తర్వాతనే బైక్, కారు, ఫ్లైట్ ఇలా ఎంది ఉంటే దాని వెళ్లి అడగాలన్నాడు. ఇక శుభ్‌మన్‌గిల్ టీమిండియా ఫ్యూచర్ స్టార్ అని చెప్పుకొచ్చాడు.