Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Year Ender 2020: ఐపీఎల్ టైటిల్ మినహా ఈ ఏడాది రోహిత్ శర్మ సాధించింది ఏం లేదు!

Rohit sharma performance in 2020

హైదరాబాద్: 2020 ప్రపంచంలోని ప్రతీ ఒక్కరిని ఏదో రూపంలో ఇబ్బందులకు గురిచేసిన ఏడాది. కరోనా గత్తర పుణ్యమా అగ్రరాజ్యలే అల్లాడాయి. ఆటలన్నీ ఆగమాగమయ్యాయి. జీవితంలోనే ఎన్నడూ ఊహించని విధంగా స్టార్ ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాకు ముందు తర్వాత అనే చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఈ ఏడాది ఏమాత్రం కలిసిరాలేదు.

సారథిగా ముంబై ఇండియన్స్‌కు ఐదో ఐపీఎల్ టైటిల్ అందించినా.. వ్యక్తిగతంగా మాత్రం పెద్దగా రాణించిందేం లేదు. ముఖ్యంగా హిట్ మ్యాన్ ఈ ఏడాది గాయాలతో సతమతమయ్యాడు. ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొన్నాడు. ఈ ఏడాది జరిగిన కొన్ని మ్యాచ్‌ల్లో రోహిత్ వ్యక్తిగత ప్రదర్శన ఎలా ఉందో గుర్తు చేసుకుందాం!

ఆస్ట్రేలియాతో సెంచరీ..!

ఆస్ట్రేలియాతో సెంచరీ..!

ఇక ఈ ఏడాది ప్రారంభంలో శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌కు హిట్ మ్యాన్ దూరమయ్యాడు. వర్క్‌లోడ్ తగ్గించడానికి టీమ్‌మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చింది. ఈ సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్‌ రద్దవ్వగా.. మిగిలిన రెండింటిలో గెలుపొందిన భారత్ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. శ్రీలంకతో సిరీస్ అనంతరం ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌కు రోహిత్ అందుబాటులోకి వచ్చాడు. తొలి రెండు వన్డేల్లో 10, 42 స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చకపోయిన ఆఖరి వన్డేలో 119 సెంచరీతో చెలరేగాడు. ఈ మూడు వన్డేల సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన భారత్.. ఆ తర్వాత రెండింటిలో గెలిచి 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది.

గాయంతో కివీస్ టూర్ నుంచి ఔట్.!

గాయంతో కివీస్ టూర్ నుంచి ఔట్.!

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ అనంతరం భారత్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ సుదీర్ఘ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరగ్గా.. రోహిత్ ఆట మూడు మ్యాచ్‌లకే పరిమితమైంది. తొలి రెండు టీ20ల్లో 7,8 దారుణంగా విఫలమైన హిట్ మ్యాన్ మూడో టీ20ల్లో హాఫ్ సెంచరీతో 65 టచ్‌లోకి వచ్చాడు. కానీ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ తొడకండరాల గాయానికి గురయ్యాడు. దాంతో సుదీర్ఘ పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. అనంతరం రెండు టీ20లు గెలిచిన భారత్ 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక టెస్ట్, వన్డే సిరీస్‌ల్లో భారత్ క్లీన్ స్వీప్‌కు గురైంది. ఈ పర్యటన అనంతరం సౌతాఫ్రికాతో స్వదేశంలో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదాపడింది. ఈ సిరీస్‌కు కూడా రోహిత్ ఎంపికవ్వలేదు.

ఐపీఎల్‌లోనూ విఫలం..

ఐపీఎల్‌లోనూ విఫలం..

కరోనా విపత్కర పరిస్థితుల్లో దుబాయ్‌కి తరలిన ఐపీఎల్‌లో మళ్లీ బ్యాట్‌ పట్టిన రోహిత్.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన హిట్ మ్యాన్ 332 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో చేసిన 70 పరుగులే హయ్యెస్ట్. ఈ లీగ్‌లో కూడా రోహిత్ తొడకండరాల గాయానికి గురయ్యాడు. కొన్ని లీగ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దాంతో హిట్ మ్యాన్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకుండా సెలెక్టర్లు పక్కనపెట్టారు. కానీ ఆ మరుసటి మ్యాచ్‌నే రోహిత్ బరిలోకి దిగడంతో టీమ్ సెలెక్షన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఐపీఎల్ టైటిల్ నెగ్గడంతో..

ఐపీఎల్ టైటిల్ నెగ్గడంతో..

ఇక ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో విఫలమైనా.. ఫైనల్లో 68 పరుగులతో రాణించడం, టైటిల్ గెలవడంతో రోహిత్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపించింది. కొందరైతే పరిమిత ఓవర్ల కెప్టెన్సీని రోహిత్‌కు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఈ విమర్శలకు తలొగ్గిన టీమ్ మేనేజ్‌మెంట్ రోహిత్‌కు టెస్ట్ టీమ్‌లో చోటు కల్పించింది. కానీ హిట్ మ్యాన్ ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టుతో ఆసీస్ వెళ్లకుండా భారత్‌కు తిరిగొచ్చాడు. ఎన్‌సీఏలో ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాడు. అతని ఫిట్‌నెస్ వ్యవహారం క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించినా.. మంగళవారం ఆసీస్‌కు బయల్దేరడంతో సుఖాంతమైంది. ఆసీస్‌తో చివరి రెండు టెస్ట్‌ల్లో రోహిత్ బరిలోకి దిగనున్నాడు.

Story first published: Thursday, December 17, 2020, 8:23 [IST]
Other articles published on Dec 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+