ఎంత అణచి వేస్తే..
2018 సెప్టెంబర్ 1న రోహిత్ శర్మ ట్విటర్ వేదికగా అభిమానులతో #AskRohit పేరిట చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా.. తన ఫేవరెట్ కొటేషన్ ఏంటని ఓ అభిమాని రోహిత్ శర్మను అడిగారు. దానికి స్పందించిన హిట్ మ్యాన్ 'తనను ఎంత అణచివేస్తే అంత పైకి తిరిగొస్తా'అనే కొటేషన్ అని బదులిచ్చాడు. కాగా, గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ నుంచి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ అందుకున్న రోహిత్ తాజాగా టెస్టు పగ్గాలూ అందుకున్నాడు.

టెస్ట్‌లకే పనికారడన్నారు..
దాంతో రోహిత్‌ను మూడు ఫార్మాట్లకూ సారథిగా ఎంపిక చేయడంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పాత ట్వీట్‌ను కూడా తిరిగి రీట్వీట్ చేస్తున్నారు. అలాగే ఒకప్పుడు టెస్టులకు పనికిరాడని పక్కనపెట్టిన ఆటగాడే ఇప్పుడు టీమిండియా జట్టుకు కెప్టెన్‌గా ఎదిగాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఫ్యాన్స్ బీసీసీఐ నిర్ణయంతో తెగ సంతోషపడుతున్నారు.

ధోనీ, కోహ్లీలా...
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీల తర్వాత పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు హిట్ మ్యాన్ సిద్ధమయ్యాడు. మూడు ఫార్మట్లలోనూ కెప్టెన్లుగా వ్యవహరించిన ధోనీ, కోహ్లీ జట్టును అత్యున్నత స్థాయిలో నిలిపారు. ముఖ్యంగా కెప్టెన్సీని భారంగా చూడకుండా వీళ్లు దాన్ని ఆస్వాదించారు. కోహ్లీ సారథ్యం చేపట్టాక అతని బ్యాటింగ్ మరో స్థాయికి చేరింది. రోహిత్ కూడా అదే బాటలో సాగాల్సిన అవసరం ఉంది. వాళ్లిద్దరితో పోలిస్తే రోహిత్‌కు ఆలస్యంగా నాయకత్వ బాధ్యతలు దక్కాయి. 34 ఏళ్ల అతనికి ఫిట్‌నెస్ సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి.

ఫిట్‌నెస్ సమస్యలు..
ఈ సమయంలో అనుకోని వరంలా అతనికి మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ లభించింది. అయితే ఇది భారం కాకుండా చూసుకోవడం రోహిత్‌కు సవాలే. ముఖ్యంగా టెస్టు సారథ్యం అతడికి తేలిక కాదు. విదేశీ టెస్టుల్లో రోహిత్ బ్యాటింగ్ రికార్డు అంతంతమాత్రంగానే ఉంది. స్వదేశీ పిచ్‌లపై చెలరేగి ఆడే రోహిత్.. ఉపఖండం ఆవల, ఫాస్ట్ పిచ్‌లపై విఫలమవుతున్నాడనే ముద్ర ఉంది. దాన్ని చెరిపేసుకునే దిశగా ఇటీవల అతని ప్రదర్శన మెరుగవుతోంది. ఇక ఇప్పుడు పూర్తి స్థాయి కెప్టెన్‌గా అతను.. మరింత ఉత్తమ ఆటతీరుతో సహచరుల్లో స్ఫూర్తి నింపాల్సి ఉంది. ముఖ్యంగా వరుసగా ప్రపంచకప్‌లు ఉన్నాయి. తీవ్ర ఒత్తిడి సమయంలోనూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ జట్టును విశ్వవిజే తగా నిలపాల్సిన బాధ్యత అతనిపై ఉంది.


Click it and Unblock the Notifications
