Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ తెలుగు హీరోల సినిమాలు చూస్తాను: రోహిత్ శర్మ

టాలీవుడ్ అగ్ర హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్ సినిమాలను చూస్తానని టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తరుచుగా చూడకున్నా.. సమయం దొరికితే సినిమాలు చూస్తానని తెలిపాడు. విమల్ కుమార్ అనే సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలపై తనకు ఉన్న మక్కువను రోహిత్ శర్మ తెలియజేశాడు. తనకు యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కే చిత్రాలు, డాక్యుమెంటరీలు అంటే ఇష్టమని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మ‌కు తెలుగు భాషతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అతని అమ్మమ్మ ఊరు వైజాగ్. రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ వైజాగ్‌కు చెందినవారే. రోహిత్ మాతృ భాష తెలుగు అయినప్పటికీ అతను ఎక్కువగా మరాఠి, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతారు. తెలుగు భాష తెలిసినా స్పష్టంగా మాట్లాడలేడు. కానీ తెలుగు తనకు బాగా అర్థమవుతుందని రోహిత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Rohit Sharma Likely to Watch Telugu Heroes Movies During Break from Cricket
Photo Credit: X (twitter)

సౌత్ హీరోలను పెద్దగా అభిమానించకున్నా..బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ తన అభిమాన నటులని రోహిత్ శర్మ తెలిపాడు. హీరోయిన్లలో విద్యా బాలన్, దీపికా పడుకొనే అంటే ఇష్టమని, కరీనా కపూర్ అంటే తనకు క్రష్ ఉందని కూడా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. హైదరాబాద్‌తో రోహిత్ శర్మకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐపీఎల్ కెరీర్‌ను రోహిత్ శర్మ హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ ఛార్జర్స్‌తోనే ప్రారంభించాడు. అతను ఈ జట్టు తరఫున మూడేళ్లు ఆడాడు. అరంగేట్ర ఐపీఎల్ 2008 సీజన్‌తో పాటు 2009, 2010 వరకు డెక్కన్ ఛార్జర్స్‌లోనే కొనసాగాడు. ఐపీఎల్ 2019 టైటిల్ గెలవడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్ 2011 మెగా వేలంలో అతన్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. లేకుంటే అతనే డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యేవాడని ఆ జట్టు విన్నింగ్ కెప్టెన్ గిల్ క్రిస్ట్ చాలా ఇంటర్వ్యూల్లో తెలిపాడు. మూడేళ్ల పాటు హైదరాబాద్‌కు ఆడిన రోహిత్ శర్మకు పాపులర్ తెలుగు హీరోల గురించి అవగాహన ఉంది. రోహిత్ శర్మ బయోపిక్‌కు టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, శర్వానంద్ సరిగ్గా సరిపోతారని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉంటారు.

టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే మూడు వన్డేల సిరీస్‌తో మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

Story first published: Saturday, August 30, 2025, 18:38 [IST]
Other articles published on Aug 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+