Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం!

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఐపీఎల్ 2024 సీజన్ ఫస్టాఫ్ మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు సమాచారం. మెగా టోర్నీకి మరింత ఫిట్‌గా ఉండేందుకే రోహిత్ ఈ బ్రేక్ తీసుకునేందుకు సిద్దమయ్యాడని అతని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

ప్రస్తుతం రోహిత్ శర్మ వెన్ను నొప్పితో ఇబ్బందిపడుతున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ సందర్భంగా అతను మూడో రోజు ఆటలో ఫీల్డింగ్ కూడా చేయలేదు. రోహిత్ వెన్నునొప్పికి సంబంధించి బీసీసీఐ అధికారిక ప్రకటన కూడా చేసింది. వెన్ను నొప్పితో మూడో రోజు ఆటలో రోహిత్ శర్మ బరిలోకి దిగలేదని పేర్కొంది. అయితే అతని గాయం తీవ్రత గురించి మాత్రం వెల్లడించలేదు.

Rohit Sharma likely to miss IPL 2024 opening matches due to a stiff back

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభమవ్వడానికి ఇంకా రెండు వారాల సమయం ఉన్నా.. ఫస్టాఫ్ మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని రోహిత్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాతనే బరిలోకి దిగాలని అతను నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అతను ఆ జట్టులో సాధారణ ఆటగాడే కావడంతో రిస్క్ తీసుకోవడం ఎందుకని భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తమ సారథిగా హార్దిక్ పాండ్యా పేరును ప్రకటించింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న అతన్ని క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా జట్టులోకి తెచ్చుకుంది. ఆ వెంటనే సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది. ఫ్రాంచైజీ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.

కానీ ఈ నిర్ణయాన్ని అతని అభిమానులు, సన్నిహిత ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు. రోహిత్ సైతం కెప్టెన్సీ మార్పు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతని సతీమణి బహిరంగంగానే ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుండగా.. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముందుగా 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మిగతా 52 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను వెల్లడించనుంది. ఈ ఫస్టాఫ్ షెడ్యూల్‌లో ముంబై ఇండియన్స్ మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ నాలుగు మ్యాచ్‌లకు రోహిత్ దూరంగా ఉండే అవకాశం ఉంది.

Story first published: Saturday, March 9, 2024, 17:47 [IST]
Other articles published on Mar 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+