సిరాజ్ బౌలింగ్ సూపరో సూపర్.. న్యూజిలాండ్‌తో అంత ఈజీ కాదు: రోహిత్ శర్మ

తిరువనంతపురం: శ్రీలంకతో వన్డే సిరీస్ అద్భుతంగా సాగిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ సిరీస్‌లో భారత జట్టుకు ఎన్నో సానుకూలంశాలు లభించాయని చెప్పాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి రికార్డు విజయాన్నందుకున్నామని సంతోషం వ్యక్తం చేశాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఆఖరి వన్డేలో సమష్టిగా చెలరేగిన భారత్ 317 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే భారీ విజయాన్నందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో ఐర్లాండ్‌పై 290 పరుగుల తేడాతో న్యూజిలాండ్ సాధించిన రికార్డు విజయాన్ని అధిగమించింది. ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

ఇదో గొప్ప సిరీస్..
‘ఇది మాకు గొప్ప సిరీస్. ఎన్నో సానుకూలంశాలు ఉన్నాయి. మేం అద్భుతంగా బౌలింగ్ చేశాం. అవసరమైనప్పుడల్లా వికెట్లు తీసాం. ఈ సిరీస్ అసాంతం బ్యాటర్లు పరుగుల మోత మోగించడం కనువిందు చేసింది. మహమ్మద్ సిరాజ్ అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. స్లిప్‌లో అతను సాధించిన వికెట్లన్నిటికీ అర్హుడు. సిరాజ్‌లో చాలా అరుదైన ప్రతిభ ఉంది. గత కొన్నేళ్లుగా అతను మెరుగైన విధానం అమోఘం. సిరీస్ సిరీస్‌కు అతను తన బలాలను పెంచుకున్నాడు. ఇది భారత క్రికెట్‌కు చాలా మంచింది.

సిరాజ్ సూపరో సూపర్..
సిరాజ్ ఐదు వికెట్ల ఘనత అందుకోవాలని అన్ని విధాల ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తు ఆ మైలు రాయి సిరాజ్‌కు దక్కలేదు. కానీ నాలుగు వికెట్లు ఫిఫ్ఫర్‌తో సమానం. భవిష్యత్తులో అతను కచ్చితంగా ఐదు వికెట్ల ఘనతలను అందుకుంటాడు. అతని అమ్ముల పొదిలో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. వాటిపై బాగా హార్డ్ వర్క్ చేశాడు. తదుపరి సిరీస్‌లకు మేం సిద్దమవుతాం. తగిన ప్రణాళికలు, వ్యూహాలు రచిస్తాం. పిచ్ కండిషన్స్ బట్టి టీమ్ కాంబినేషన్‌ను ఎంచుకుంది. న్యూజిలాండ్‌ను ఓడించడం అంత సులువైన పనికాదు. ఆ జట్టు పాకిస్థాన్‌లో సిరీస్ గెలిచి వస్తుంది. కాబట్టి ఏ మాత్రం తేలికగా తీసుకోవద్దు'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య బుధవారం హైదరాబాద్ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే న్యూజిలాండ్ హైదరాబాద్‌లో అడుగుపెట్టగా.. భారత్ సోమవారం చేరుకోనుంది.

శతక్కొట్టిన కోహ్లీ, గిల్..
శ్రీలంకతో మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166 నాటౌట్), శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116) శతక్కొట్టగా... కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(38) పర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజితా, లాహిరు కుమార రెండేసి వికెట్లు తీయగా.. కరుణరత్నే ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక.. మహమ్మద్ సిరాజ్(4/32) ధాటికి 22 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. నువనిందు ఫెర్నాండో(19), డసన్ షనక(11), కసున్ రజిత(13 నాటౌట్) మినహా ఎవరూ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. భారత బౌలర్లలో సిరాజ్‌కు తోడుగా..మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అషెన్ బండార గాయం కారణంగా బ్యాటింగ్ రాలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications