న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Bumrah vs Sanjana: ఇంత‌కుముందు నిన్నెక్క‌డో చూశానే.. నేను ఎప్పుడూ ఇక్క‌డే ఉంటా!!

Where have I seen you before: Jasprit Bumrah trolls Sanjana Ganesan

సౌథాంప్ట‌న్‌: టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా మార్చి 15న ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. స్టార్ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, మోడల్ సంజనా గణేశన్‌ను అతడు ప్రేమించి పెళ్లాడాడు. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో గోవా వేదికగా వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అయ్యేవరకు పూర్తి వివరాలు గోప్యంగా ఉంచిన బుమ్రా.. ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఎంత సీక్రెట్ మెయింటేన్ చేశారంటే.. బుమ్రా, సంజన షేర్ చేసేవరకు వారి పెళ్లి ఫొటోలు ఒక్కటి కూడా బయటకు రాలేదు. అసలు వీరికి వివాహం జరుగుతుందనే ఎవరూ ఊహించలేదు.

పెళ్లి తర్వాత జస్ప్రీత్ బుమ్రా, సంజనా గణేశన్‌లు తమతమ పనుల్లో బిజీ అయ్యారు. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ప్రస్తుతం ఇద్దరూ లండన్‌లో ఉన్నారు. చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సమాయత్తమవుతున్న బుమ్రాను తన భార్య సంజనా గణేషన్‌ ఇంటర్య్వూ చేసిన వీడియోను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోలో తన చిన్ననాటి విషయాలతో పాటు పెళ్లి తర్వాత తన జీవితంలో జరిగిన మార్పుల గురించి చెప్పుకొచ్చాడు. చిన్నప్పుడు చెల్లితో క్రికెట్‌ ఆడడం.. ఆ తర్వాత స్కూల్‌ దశలో ఆడిన రోజులను ఎప్పటికి మరిచిపోను. పెళ్లి తర్వాత మరో కొత్త జీవితం మొదలైందని బుమ్రా చెప్పాడు.

అంతకుముందు ఇంట‌ర్వ్యూకి వ‌స్తున్న స‌మ‌యంలో అక్క‌డ రెడీగా ఉన్న సంజనా గణేశన్‌ను చూసిన జస్ప్రీత్ బుమ్రా.. ఇంత‌కుముందు నిన్నెక్క‌డో చూశానే అని అంటాడు. దానికి ఆమె నేను ఎప్పుడూ ఇక్క‌డే ఉంటాను అని సరదాగా చెప్పింది. ఇంట‌ర్వ్యూలో ఎలా మాట్లాడాలి, త‌న‌ను తాను ఎలా ప‌రిచ‌యం చేసుకోవాలో కూడా బుమ్రాకు సంజనానే వివ‌రిస్తుంది. ఆ త‌ర్వాత తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మ‌రుపురాని ఫొటోలను బుమ్రాకు చూపిస్తూ.. వాటి గురించి చెప్పాల‌ని సంజ‌న అడుగుతుంది.

తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మ‌రుపురాని ఫొటోలను భారత పేసర్ బుమ్రాకు చూపిస్తూ వాటి గురించి చెప్పాల‌ని సంజనా అడిగింది. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీతో ఉన్న ఫొటో, తాను గిటార్ వాయిస్తున్న ఫొటో, సంజ‌న‌తో పెళ్లి ఫొటోల గురించి బుమ్రా వివరించాడు. త‌న పెళ్లి ఫొటోను చూస్తూ.. ఇది త‌న జీవితంలో మ‌రుపురాని రోజు అని, ఈ మ‌ధ్యే ఈ అద్భుతం జ‌రిగింద‌ని సంజనతో యార్కర్ కింగ్ చెప్పుకొచ్చాడు.

MS Dhoni సిక్స్​కు గూగుల్​ గుర్తింపు.. ఆనందంలో ఫ్యాన్స్!!MS Dhoni సిక్స్​కు గూగుల్​ గుర్తింపు.. ఆనందంలో ఫ్యాన్స్!!

ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన జస్ప్రీత్ బుమ్రా.. 23 జనవరి 2016లో భారత జట్టులోకి ఆరంగేట్రం చేశాడు. గత ఐదు సంవత్సరాలుగా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. ప్రస్తుతం భారత పేస్ విభాగంను తన భుజాలపై మోస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి బుమ్రా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం సాధన చేస్తున్నాడు. ఇక అక్టోబరు-నవంబరులో టీ20 ప్రపంచకప్‌ ఉంది. అందులో అతడు కీలకం కానున్నాడు. బుమ్రా భారత్ తరఫున 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20లు ఆడాడు.

Story first published: Thursday, June 17, 2021, 16:17 [IST]
Other articles published on Jun 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X