For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతనికి వీసా లేకపోవడంతో తనుష్ కోటియన్‌ను తీసుకున్నాం: రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన ఎటకారంతో నవ్వులు పూయించాడు. టీమిండియా సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఆస్ట్రేలియాకు వచ్చేందుకు వీసా లేదని, అందుకే యువ స్పిన్నర్ తనూష్ కోటియన్‌ను ఎంపిక చేశామని సెటైర్లు పేల్చాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.
సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో ముంబై ఆల్‌రౌండర్ తనూష్ కోటియన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. చివరి రెండు టెస్ట్‌లకు తనూష్ కోటియన్‌ అందుబాటులో ఉండనున్నాడు.

రోహిత్ ఎటకారం..!
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ జరగనుంది. గురువారం నుంచి ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ నేపథ్యంలో రోహిత్ శర్మ మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా కుల్దీప్ యాదవ్‌ను కాదని తనూష్ కోటియన్‌ ఎంపిక చేయడంపై రిపోర్టర్స్ ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చాడు.

Rohit Sharma jokingly said Tanush Kotian s selection in the Test squad due to Kuldeep didn t have a visa

'కుల్దీప్ యాదవ్‌కు ఆస్ట్రేలియా వీసా లేదు. తనూష్ కోటియన్ భారత్-ఏ తరఫున గత నెలలో ఇక్కడికి వచ్చాడు. మాకు వీలైనంత త్వరగా జట్టులో చేరే ఆటగాడు కావాలి. అందుకు తనుష్ సిద్దంగా ఉండటంతో ఎంపిక చేశాం. కానీ ఇదంతా జోక్. తనుష్ కోటియన్ ఇప్పటికే ఆసీస్ గడ్డపై ఆడాడు. గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. మాకు బ్యాకప్ స్పిన్నర్ కావాలనుకున్నాం. సిడ్నీలో ఇద్దరు స్పిన్నర్లు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడితే బ్యాకప్ అవసరమవుతోంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

కుల్దీప్ ఫిట్‌గా లేడు..
కుల్దీప్ యాదవ్.. హెర్నీయా సర్జరీ చేయించకున్నాడని, ఇటీవలే అక్షర్ పటేల్‌ తండ్రి అవ్వడంతో సెలెక్షన్‌కు అందుబాటులో లేడని రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. 'కుల్దీప్ యాదవ్ 100 శాతం ఫిట్‌గా లేడు. అతనికి హెర్నీయా సర్జరీ జరిగింది. మరో ఆప్షన్ అయిన అక్షర్ పటేల్‌ ఇటీవలే తండ్రయ్యాడు.

అతను ఆసీస్‌కు వచ్చేందుకు సిద్దంగా లేడు. దాంతో మాకు తనుష్ సరైన్ ఆప్షన్ అనిపించింది. దేశవాళీ క్రికెట్‌లో అతను తన సత్తా ఏంటో చూపించాడు. గతేడాది ముంబై రంజీ ట్రోఫీలో గెలవడంలో అతను ఆల్‌రౌండర్‌గా కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉండటంతో మాకు సరైన ఆప్షన్‌ అనిపించింది.'అని రోహిత్ శర్మ తెలిపాడు.

తనూష్ ట్రాక్ రికార్డ్..
ఆఫ్ స్పిన్నర్ అయిన 26 ఏళ్ల తనుష్ కోటియన్ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతిష్టాత్మక వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున తనుష్ కోటియన్ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసి 38 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

అశ్విన్ తరహాలో ఆఫ్ స్పిన్ వేయడంతో పాటు లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటం తనుష్ కోటియన్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటి వరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తనుష్ కోటియన్ 101 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. బ్యాటర్‌గా రెండు శతకాలతో పాటు 13 హాఫ్ సెంచరీలతో 1525 పరుగులు చేశాడు.

Story first published: Tuesday, December 24, 2024, 11:42 [IST]
Other articles published on Dec 24, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+