Rohit Sharma రిస్కీ డ్రైవింగ్ .. భారీ జరిమానా విధించిన పోలీసులు!
ముంబై: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ముంబై పోలీసులు భారీ జరిమానా విధించారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకుండా కారును అతివేగంగా నడిపినందుకు మూడు చలాన్లు విధించారు. ఓ వైపు వన్డే ప్రపంచకప్ జరుగుతుండగా.. టీమిండియా కెప్టెన్ ఇలా వేగంగా కారు నడపడం ఏ మాత్రం భావ్యం కాదని పోలీసులు హితవు పలికారు. టీమ్ బస్సులో పోలీసుల ప్రొటెక్షన్‌లో వెళ్లాలని సూచించారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యింది. గత శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్‌తో చెలరేగాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం తదుపరి మ్యాచ్‌కు ఐదు రోజుల విశ్రాంతి లభించింది.

దాంతో హిట్ మ్యాన్ అహ్మదాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో ముంబైకి చేరుకున్నాడు. రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపాడు. తదుపరి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో పుణేలోనే ఉండటంతో రోహిత్ శర్మ తన సొంత కారులో అక్కడికి బయల్దేరాడు. అయితే అతను కారును వేగంగా నడిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
గంటకు 200 కిలోమీటర్ల నుంచి 215 కిలోమీటర్ల వేగంతో హిట్ మ్యాన్ కారు నడిపినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ రూల్స్ విరుద్దంగా అతి వేగంగా దూసుకెళ్లిన రోహిత్ శర్మ కారుపై మూడు చలాన్లు విధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. 'వన్డే ప్రపంచకప్ మధ్యలో టీమిండియా కెప్టెన్ ఇలా స్పీడ్‌గా కారు నడపడం ఏ మాత్రం శ్రేయస్కారం కాదు. అతను టీమ్ బస్సులో పోలీసులు సంరక్షణలో ప్రయాణం చేయాలి.'అని ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు తెలిపారు.
అతి వేగంగా కారు నడిపిన రోహిత్ శర్మపై నెటిజన్లు మండిపడుతున్నారు. రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదం అయిన తర్వాత కూడా టీమిండియా ఆటగాళ్లు సొంతంగా డ్రైవింగ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వన్డే ప్రపంచకప్ మధ్యలో ఆటగాళ్లను ఇళ్లకు పంపించడం ఏంటని? నిలదీస్తున్నారు. ఒకవేళ అనుమతించినా.. సొంత కారులో వచ్చేందుకు ఎలా ఒప్పుకున్నారని బీసీసీఐ అధికారులపై మండిపడుతున్నారు.
ఏదైనా జరగరానిది జరిగితే టీమిండియా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. రోహిత్ శర్మకు ఇంత బాధ్యతా రాహిత్యం పనికిరాదని విమర్విస్తున్నారు. అయితే రోహిత్ శర్మనే కారు నడిపాడా? లేక డ్రైవర్ అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications