
చూడ ముచ్చటగా..
‘ఈ విజయం పట్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మిడిలార్డ్ ముందుకు రావడం, కుర్రాళ్లు బాధ్యత వహించడం, మ్యాచ్ ముగించడం చూడ ముచ్చటగా ఉంది. బౌలర్ల పట్ల నేను కఠినంగా ఉండలేను. ఈ రోజుల్లో ఇలా ధారళంగా పరుగులిచ్చుకోవడం సర్వసాధారణం. కానీ మేం 15 ఓవర్ల వరకు కట్టడిగానే బౌలింగ్ చేశాం. ఇక పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. జట్టులో ఉన్న కుర్రాళ్లంతా ఎంతో ప్రతిభావంతమైన ప్లేయర్లు. వాళ్లంతా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సత్తా చాటాలనే ఆకలితో ఉన్నారు.

జడ్డూ, శ్రేయస్ సూపర్..
వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా చెలరేగుతూ జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఈ మ్యాచ్ ముగించిన విధానం అసాధారణం. జడేజా అద్భుతంగా తనదైన శైలిలో ఆడాడు. తొలి బంతి నుంచి చాలా పాజిటీవ్‌గా కనిపించాడు. శ్రేయస్ సైతం అదరగొట్టాడు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో ఎవరో ఒకరు చివరి వరకు ఉండి మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నాం. చివరకు అదే చేసి విజయాన్నందుకున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

రికార్డు విజయం..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పతుమ్ నిసాంకా (53 బంతుల్లో 11 ఫోర్లతో 75) అర్ధసెంచరీ సాధించగా, గుణతిలక (29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించాడు. చివర్లో డసన్ షనక (19 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47 నాటౌట్) చెలరేగిపోవడంతో లంకకు భారీ స్కోరు సాధ్యమైంది.
అనంతరం భారత్ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 186 పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 11వ విజయం నమోదు చేసుకుంది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' శ్రేయస్ అయ్యర్ (44 బం తుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 నాటౌట్), జడేజా (18 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 నాటౌట్), శాంసన్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) మెరుపు ఇన్నింగ్స్‌లు జట్టును గెలిపించాయి. చివరి టి20 నేడు ఇదే మైదానంలో జరుగుతుంది.


Click it and Unblock the Notifications
