For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs MI: టీ20 క్రికెట్‌లో అరుదైన ఘ‌న‌త.. తొలి ఇండియ‌న్‌గా రోహిత్ శ‌ర్మ‌ రికార్డు!!

Rohit Sharma hits 400 sixes in T20 cricket to becomes 1st Indian batsman achieved the feat

షార్జా: ఐపీఎల్‌ 2021లో భాగంగా మంగళవారం రాత్రి షార్జా వేదికగా రాజస్థాన్​ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటగా నాథన్ కౌల్టర్‌నైల్‌ (4/14), జేమ్స్ నీషమ్‌ (3/12), జస్ప్రీత్ బుమ్రా (2/12) సూపర్‌ బౌలింగ్‌తో రాజస్థాన్‌ బ్యాటర్లను హడలెత్తించారు. దీంతో రాజస్థాన్‌ 9 వికెట్లకు 90 పరుగులకే పరిమితమైంది.

ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ ( 50 నాటౌట్‌; 25 బంతుల్లో 5×4, 3×6) చెలరేగి ఆడటంతో.. ముంబై స్వల్ప లక్ష్యాన్ని మరో 70 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఛేదించింది. ఇక ప్లే ఆఫ్స్‌కి చేరాలంటే సన్‌రైజర్స్‌ జట్టుతో జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబై తప్పనిసరిగా గెలవాలి. అంతేకాదు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ని రాజస్థాన్‌ రాయల్స్ ఓడించాలి.

టీ20 క్రికెట్‌లో 400వ సిక్స‌ర్లు

టీ20 క్రికెట్‌లో 400వ సిక్స‌ర్లు

ఈ మ్యాచులో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘ‌న‌త అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 400 సిక్స‌ర్లు బాదాడు. రాయల్స్‎తో జరిగిన మ్యాచ్‌లో రెండు సిక్సర్‌లు బాదిన రోహిత్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ భారత్ త‌ర‌ఫున రోహిత్ మాత్ర‌మే ఈ ఘ‌న‌త సాధించాడు. హిట్‌మ్యాన్ త‌ర్వాత ఏ బ్యాట‌ర్ కూడా 350 సిక్స‌ర్లు దాటలేదు.

325 సిక్స‌ర్ల‌తో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట‌ర్ సురేశ్ రైనా రెండో స్థానంలో ఉండ‌గా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 320 సిక్స‌ర్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టీ20 క్రికెట్‌లో 304 సిక్స్‌లు బాదాడు.

T20 World Cup 2021: ఛాంపియన్ బౌలర్.. అతడు భారత టీ20 ప్రపంచ జట్టులోకి వస్తాడు: హర్భజన్‌

ఐపీఎల్‌ టోర్నీలో 227 సిక్సులు

ఐపీఎల్‌ టోర్నీలో 227 సిక్సులు

రోహిత్ శర్మ బాదిన మొత్తం 400 సిక్స‌ర్ల‌లో 133 భారత జట్టు త‌ర‌ఫున కాగా.. 227 ఐపీఎల్‌ టోర్నీలో బాదాడు. మ‌రో 24 సిక్సులు చాంపియన్స్ లీగ్ టీ20లో కొట్టాడు. టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స్‌ల రికార్డు విండీస్ దిగ్గ‌జం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. 1042 సిక్స‌ర్ల‌తో అత‌డు ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నాడు. క్రికెట్ చ‌రిత్ర‌లో 1000 సిక్స‌ర్లు దాటిన ఏకైక ప్లేయ‌ర్ కూడా అత‌డే. ఆ త‌ర్వాత కీరన్ పొలార్డ్ (758), ఆండ్రీ ర‌సెల్ (510), బ్రెండ‌న్ మెక‌ల‌మ్ (485), షేన్ వాట్స‌న్ (467), ఏబీ డివిలియ‌ర్స్ (434) వరుసగా ఉన్నారు.

మరో ప్రత్యేక మైలురాయి

మరో ప్రత్యేక మైలురాయి

ఐపీఎల్ 2021 రెండో దశలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్ శర్మ మరో ప్రత్యేక మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్​లో ఓ ప్రత్యర్థి జట్టుపై 1000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్​గా రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో సన్​రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్..​ పంజాబ్ కింగ్స్​పై 943 పరుగులు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు.

వార్నర్ కోల్‌కతాపై కూడా 915 రన్స్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 909 (ఢిల్లీ క్యాపిటల్స్) పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్​లో అత్యధిక సార్లు ఓ బౌలర్ చేతిలో ఔట్ అయిన జాబితాలో ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు. జహీర్ ఖాన్ చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఐపీఎల్​లో 7సార్లు ఔట్ చేశాడు. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని సందీప్ శర్మ 7 సార్లు, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను సునీల్ నరైన్ 7 సార్లు ఔట్ చేశారు.

Story first published: Wednesday, October 6, 2021, 18:52 [IST]
Other articles published on Oct 6, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+