T20 World Cup 2021: ఛాంపియన్ బౌలర్.. అతడు భారత టీ20 ప్రపంచ జట్టులోకి వస్తాడు: హర్భజన్

ముంబై: త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2021కు రంగం సిద్ధమవుతోంది. ఒమన్, యూఏఈలో జరగనున్న మెగా టోర్నీ కోసం యునైటెడ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా భారత జట్టును ప్రకటించింది. అయితే అక్టోబర్ 10 వరకు తుది జట్లలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పేర్కొంది. దీంతో భారత జట్టులో ఏవైనా మార్పులు, చేర్పులు చేస్తారా అనే విషయంపై చర్చ నడుస్తోంది. ఇందుకు కారణం ఆటగాళ్ల ప్రదర్శనే.

చహల్‌కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్ 2021 కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చహల్‌కు చోటు దక్కలేదు. రవీంద్ర జడేజాకు జతగా రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్ ప్రదర్శన ద్వారా చహర్, చక్రవర్తిలు ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్నారు.
దాంతో రెగ్యులర్ స్పిన్నర్ అయిన యూజీకి మాత్రం నిరాశే ఎదురైంది. అయితే యూఏఈలోనే జరుగుతున్న ఐపీఎల్ 2021 రెండో దశలో అశ్విన్, చహర్, చక్రవర్తిలు విఫలమవుతుండగా.. చహల్ మాత్రం అదరగొడుతున్నాడు. వికెట్లు పడగొడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఓ మ్యాచులో తన 4 ఓవర్ల స్పెల్‌లో 11 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.

ఛాంపియన్ బౌలర్
యుజువేంద్ర చహల్ అద్భుత ప్రదర్శన చేస్తుండడంతో భారత జట్టులో ఏవైనా మార్పులు, చేర్పులు చేస్తారా అనే విషయంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో చహల్ జట్టుకు ఎంపికవుతాడని ఆశిస్తున్నట్లు టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. 'నీవు ఎప్పటిలాగే అత్యుత్తమంగా ఆడుతున్నావు. దానిని కొనసాగించు. సరైన వేగంతో బౌలింగ్ చేస్తున్నానని నిర్ధారించుకో.
చాలా నెమ్మదిగా అసలు బౌలింగ్ చేయకు. టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియాలో నిన్ను చూడాలని ఆశిస్తున్నా. ఛాంపియన్ బౌలర్' అని హర్భజన్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్‌లో చహల్ ఆర్‌సీబీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. 'ఆర్‌సీబీ విజయాల కోసం నేను వంద శాతం కృషి చేస్తా' అని ఇటీవల ట్వీట్ చేశాడు.

సెహ్వాగ్ కూడా
ఇటీవల టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా యుజువేంద్ర చహల్ విషయంలో బీసీసీఐపై మండిపడ్డాడు. 'చహల్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడు గతంలో కూడా బాగా బౌలింగ్ చేశాడు. అయినా టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి అతడిని ఎందుకు తప్పించారో నాకు అర్థం కాలేదు. ఈ విషయంలో సెలెక్టర్లు వివరణ ఇవ్వాలి.
శ్రీలంక పర్యటనలో రాహుల్ చహర్ అంత బాగా ఏమీ బౌలింగ్ చేయలేదు. చహల్ బౌలింగ్ చేస్తున్న తీరు చూస్తే.. అతను టీ20 క్రికెట్‌లో ఏ జట్టుకైనా ఓ ఆస్తిలా ఉంటాడు. ఎలా బౌలింగ్ చేయాలో, వికెట్లు ఎలా తీయాలో అతనికి తెలుసు. ముంబైతో జరిగిన మ్యాచులో బంతితో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మిడిల్ ఆర్డర్‌లలో వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టాడు' అని వీరూ పేర్కొన్నాడు.

భారత టీ20 ప్రపంచకప్ జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
RCB vs SRH Dream11: డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! హెడ్ టు హెడ్ రికార్డ్స్, తుది జట్లు ఇవే!!