
బ్రిస్బేన్: ఉత్కంఠభరిత, ఉద్విగ్న క్షణాలు... హోరాహోరీ సమరాలు, అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనలు... అన్ని కలగలిసిన బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ అంతిమ మ్యాచ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన డిసైడర్ నాలుగో టెస్ట్‌లో టీమిండియా సంచలన విజయాన్ని అందుకుంది. ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని అనూహ్య రీతిలో ఛేదించింది. రిషభ్ పంత్(89 నాటౌట్), శుభ్‌మన్ గిల్(91) దూకుడు కనబర్చగా.. పుజారా(56) తనదైన డిఫెన్స్‌తో మెరిసాడు. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుని గబ్బా చరిత్రను తిరగరాసింది.
అయితే ఈ మ్యాచ్ విజయానందంలో రోహిత్ శర్మ అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇంతకేం జరిగిందంటే.. భారత్ విజయానికి మూడు పరుగుల కావాల్సిన స్థితిలో జోష్ హజెల్ వుడ్ వేసిన లో ఫుల్ టాస్‌ను మిడాఫ్ మీదుగా ఫోర్ తరలించగా.. భారత శిభిరంలో ఆనందాలు రెకెత్తాయి.
ఈ ఉద్విగ్న క్షణాన.. కెప్టెన్ రహానే, వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ ఆలింగనం చేసుకుంటూ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో రోహిత్ "Bhe**hod అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. ఇది టీవీ కెమెరాల్లో స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక క్రికెట్‌లో ఆటగాళ్లు ఇలాంటి పదాలు ఉపయోగించడం సహజమే.
ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ 369 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులే చేసింది. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును శార్దూల్ ఠాకూర్(67), వాషింగ్టన్ సుందర్(62) అద్వితీయ బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను పోటీలో నిలిపారు.
అనంతరం ఆసీస్... మహ్మద్ సిరాజ్(5/73), శార్దూల్(4/61) ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులే చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ 33 పరుగుల లీడ్ అందుకొని భారత్ ముందు 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ టఫ్ టార్గెట్‌ను భారత్.. శుభ్‌మన్, పంత్ పుణ్యామా ఆడుతూ పాడుతూ చేధించింది.