తొడలు కమిలిపోయినా..
అయితే ఈ సెంచరీ ఇన్నింగ్స్ వెనుక రోహిత్ తీవ్ర నొప్పిని అనుభవించాడు. 353 నిమిషాలపాటు క్రీజులో నిలుచున్న రోహిత్ శర్మ తొడలు కమిలిపొయాయి. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో థై ప్యాడ్స్ రాసుకోవడం.. ఇంగ్లండ్ బౌలర్ల బంతులు బలంగా తాకడంతో రెండు తొడలు ఎర్రగా కమిలిపోయాయి. ఔటైన అనంతరం తొడలపైన అయిన గాయాలకు రోహిత్ చికిత్స తీసుకుంటున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. కష్టం ఊరికేపోదని, రోహిత్ ఇన్నింగ్సే ఇందుకు ఉదహారణని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హిట్ మ్యాన్ కమిట్‌మెంట్ హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అతని గాయానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ సెల్యూట్ చేస్తున్నారు.
15,000 పరుగులు
సుదీర్ఘ ఫార్మాట్‌లో విదేశీ గడ్డపై హిట్‌మ్యాన్‌కు ఇది తొలి శతకం కాగా.. మొత్తంగా ఎనిమిదోది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ బాదడం ద్వారా పలు రికార్డులను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో శతకం బాదిన హిట్‌మ్యాన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన 8వ భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
ఓపెనర్11,000 పరుగులు
అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా రోహిత్ 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా (246 ఇన్నింగ్స్‌ల్లో)11 వేల మైలురాయిని అందుకున్న రెండో ఆటగాడిగా రోహిత్ నిలవగా.. అతని కంటే ముందు సచిన్ తెందూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. సచిన్ 241 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు.

టెస్టుల్లో 3 వేల పరుగులు
ఓవల్‌లో సెంచరీ బాదిన రోహిత్.. టెస్టుల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
2021లో 1000 పరుగులు
ఈ మ్యాచ్‌లో శతకం బాదడం ద్వారా 2021లో హిట్‌మ్యాన్ 1000 పరుగులు పూర్తి చేశాడు.
ఇంగ్లండ్‌లో 2000 పరుగులు
రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం ద్వారా ఇంగ్లాండ్ గడ్డపై రోహిత్ శర్మ రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.

రెండు సెషన్లు ఆడితే.
ఇంగ్లండ్ జరుగుతున్న నాలుగో టెస్ట్‌పై టీమిండియా పట్టు బిగించింది. తొలిసారి ఒకరోజు మొత్తం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కితే... చతేశ్వర్ పుజారా (127 బంతుల్లో 9 ఫోర్లతో 61), కేఎల్ రాహుల్ (101 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 46) తమ వంతు పాత్ర పోషించారు. వెరసి శనివారం జరిగిన మూడు సెషన్లలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా... వెలుతురు మందగించి ఆటను నిలిపి వేసే సమయానికి 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (22 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు కోహ్లీ, జడేజా కనీసం ఒక సెషనంతా నిలబడి... ఆ తర్వాత రహానే, రిషభ్ పంత్, శార్దుల్ ఠాకూర్ కూడా రాణిస్తే ఈ టెస్టులో భారత్ శాసించే స్థితికి చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications












