అమ్మాయిల విజయం.. రోహిత్ శర్మ భావోద్వేగం!(వీడియో)
ఒక కల.. దశాబ్దాలుగా ఊరిస్తున్న ఒక మహాస్వప్నం.. ఎట్టకేలకు సాకారమైంది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దశాబ్దాలుగా గుండెలను పిండేస్తున్న ఆవేదనకు విముక్తి లభించింది. గతంలో తుది మెట్టుపై చిందిన కన్నీటి చుక్కలన్నీ నేడు ఆనంద భాష్పాలుగా మారాయి. ఎన్నో ఏండ్ల కలను సాకారం చేసుకున్న భారత అమ్మాయిల జట్టు ఎట్టకేలకు జగజ్జేతగా అవతరించింది.
1983 జూన్ 25న కపిల్ దేవ్ లార్డ్స్ బాల్కానీలో కప్పు అందుకున్న క్షణం భారత క్రికెట్ గతిని మార్చినట్టే.. 2025 నవంబర్ 2న నవీ ముంబై డీవై పాటిల్ స్టేడియం గడ్డపై హర్మన్‌సేన తొలి ప్రపంచకప్‌ను ముద్దాడింది.
క్రికెట్ దిగ్గజాలు సచిన్, మిథాలీరాజ్, రోహిత్ శర్మ సాక్షిగా.. వేలాది మంది అభిమానుల వందేమాతర నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోతుండగా.. కోట్లాది మంది టీవీల ముందు ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. క్రికెట్ మహాసంగ్రామంలో గెలిచిన మన మగువలు మహారాణులుగా నిలిచారు. ఫైనల్ ఒత్తిడిని చిరునవ్వుతో జయిస్తూ తొలిసారి తుదిపోరు చేరిన సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించారు.

ఈ గెలుపుతో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వచ్చిన దు:ఖాన్ని దాచుకొని అమ్మాయిల విజయాన్ని ఆస్వాదించాడు. సతీమణి రితికా సజ్దేతో కలిసి ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించిన రోహిత్.. సచిన్, మిథాలీ రాజ్ వంటి దిగ్గజాలతో అమ్మాయిలకు అండగా నిలిచాడు.
విజయం వరించిన క్షణం లేచి చప్పట్లు కొట్టిన రోహిత్.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అమ్మాయిలు విజయం సాధించిన మరుక్షణమే టీవీ కెమెరాలు రోహిత్‌ను చూపించాయి. తీవ్ర ఆవేదనకు గురైన రోహిత్ ఆకాశం వైపు చూస్తూ.. తన దు:ఖాన్ని ఆపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఒకసారిగా రోహిత్‌కు తమ టీ20 ప్రపంచకప్ 2024 విజయం గుర్తొచ్చినట్లుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
Story first published: Monday, November 3, 2025, 11:17 [IST]
Other articles published on Nov 3, 2025
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications