Rohit Sharma: కెప్టెన్సీ తర్వాత కానీ ముందు ఒళ్లు తగ్గించుకో! వడాపావ్‌లు తినడం మానేయ్! ఫ్యాన్స్ ఫైర్!

ముంబై: సౌతాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. టెస్ట్ వైస్ కెప్టెన్‌గా, వన్డే కెప్టెన్‌గా డబుల్ ప్రమోషన్ అందుకున్న రోహిత్ శర్మ.. చివరి నిమిషంలో గాయపడి మూడు టెస్ట్‌ల సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ పర్యటనకు ముందు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్‌లో హిట్ మ్యాన్ బ్యాటింగ్ సాధన చేస్తూ.. తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సోమవారం ప్రకటించింది. సౌతాఫ్రికా-ఎతో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్‌లో భారత్-ఏ జట్టును నడిపించిన ప్రియాంక్ పాంచల్‌ను రోహిత్ స్థానంలో ఎంపిక చేసింది.
ఇక రోహిత్‌కు గతంలో అయిన హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రోహిత్ గాయం ఏ స్థాయిలో ఉందనే దానిపై క్లారిటీ లేదు. అయితే లో లెవెల్ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ నుంచి కోలుకునేందుకు కనీసం నెల రోజుల టైమ్ పడుతుందని టీమ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌతాఫ్రికాతో జనవరి 19 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు అయినా రోహిత్ అందుబాటులోకి వస్తాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.
రోహిత్ ఒళ్లు తగ్గించు..
ఇక రోహిత్ శర్మ గాయంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్‌ను తప్పించి రోహిత్ శర్మను నియమించినందుకు బీసీసీఐకి తగిన గుణపాఠం జరిగిందంటున్నారు. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్, బ్యాట్స్‌మన్ కావచ్చని, కానీ ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీ కాలి గోటికి కూడా సరిపోడని కామెంట్ చేస్తున్నారు. దానికి తాజా గాయమే ఉదహారణని పేర్కొంటున్నారు. కెప్టెన్సీ తర్వాత కానీ ముందు ఒళ్లు తగ్గించుకొని ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాలని నెటిజన్లు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు.
వడపావ్‌లు పక్కన పెట్టు..
అయితే హ్యామ్ స్ట్రింగ్ ఇంజ్యూరీ రోహిత్‌కు గతంలో కూడా అయింది. అప్పుడే రోహిత్ డాక్టర్లు బరువు తగ్గాలని సూచించారు. అప్పర్ బాడీ వెయిట్ తగ్గిస్తే ఈ సమస్య ఉండదని చెప్పారు. అప్పట్లో వెయిట్ లాస్ అయిన రోహిత్.. ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టాడు. అయితే మళ్లీ ఈ గాయానికే గురవ్వడంతో నెటిజన్లు.. బరువు తగ్గడంపై దృష్టిసారించాలని నెటిజన్లు హిట్ మ్యాన్‌కు సూచిస్తున్నారు. ముందు వడాపావ్‌లు తినడం మానేయాలని హితవు పలుకుతున్నారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ అనంతరం రోహిత్.. వడాపావ్‌లు బాగా తిన్నట్టున్నాడని, అందుకే మళ్లీ గాయపడ్డాడని సెటైర్లు పేల్చుతున్నారు.
ఓవర్‌సీస్ సిరీస్ అనగానే..
అంతేకాకుండా ఓవర్‌సీస్ సిరీస్ అనగానే రోహిత్ శర్మ గాయం అవుతుందని సెటైర్లు పేల్చుతున్నారు. 2014లో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్, గతేడాది న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, ఇప్పుడు సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లకు రోహిత్ శర్మ గాయంతోనే దూరమయ్యాడు. ఈ విషయాన్నే గుర్తు చేస్తూ రోహిత్‌పై ఫ్యాన్స్ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) పర్యటనలు అనగానే రోహిత్.. గాయమనే ట్రిక్‌తో తప్పించుకుంటాడని కామెంట్ చేస్తున్నారు. సూపర్ ట్రిక్ హిట్ మ్యాన్ అంటూ ఎగతాళి చేస్తున్నారు.
4 టెస్ట్‌ల్లో విఫలం..
సౌతాఫ్రికా గడ్డపై రోహిత్ శర్మ ఇప్పటి వరకు 4 టెస్టులు ఆడగా... నాలుగింటిలో దారుణంగా విఫలమయ్యాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 14, 6, 0, 25, 11, 10, 10, 47 మాత్రమే చేశాడు. అయితే ఇదంతా అతను మిడిలార్డర్‌లో ఆడినప్పటి స్థితి. 2019లో సొంతగడ్డపై సౌతాఫ్రికాతోనే ఓపెనర్‌గా మారిన రోహిత్.. టెస్టుల్లోనే భీకర ఆటగాడిగా మారిపోయాడు. నాటి వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేస్తూ అద్భుత షాట్లతో పాటు మెరుగైన స్ట్రయిక్‌రేట్‌తో ఆడుతూ జట్టుకు శుభారంభాలు అందించాడు. ఓపెనర్‌గా మారిన తర్వాత రోహిత్ శర్మ 16 టెస్టుల్లో ఏకంగా 58.48 సగటుతో 1,462 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు కూడా ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications