ఓయ్ రోహిత్.. ఆ బంతి ఎలా ఉందోయ్! ఫీల్డింగ్ చేస్తున్న హిట్‌మ్యాన్‌ను ఎగతాళి చేసిన ఫ్యాన్స్ (వీడియో)

దుబాయ్: ఎక్కడా జరిగినా.. ఎప్పుడు జరిగినా.. ఎలా జరిగినా.. ఐసీసీ ప్రపంచకప్‌ల్లో పాకిస్థాన్‌పై భారతే గెలుస్తుంది. ఇది చరిత్ర.. 1975 నుంచి మొదలుపెడితే 2016 వరకు 12 మ్యాచ్‌లు ఆడితే అన్ని విజయాలు ఇండియావే.. ఇది రికార్డు..! కానీ ఈసారి హిస్టరీ రిపీట్ కాలేదు.. రికార్డు కొనసాగలేదు.! యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఆతృతతో, ఆసక్తితో ఎదురుచూసిన అరుదైన పోరులో టీమిండియా అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. ఎన్నడూ లేని విధంగా.. ఏనాడూ ఆడని రకంగా.. చరిత్రకు పూర్తి భిన్నంగా.. పాక్ బౌలర్ల ముందు టీమిండియా మొనగాళ్లు బ్యాట్లు ఎత్తేశారు. ఇక బౌలర్లు కూడా పరుగుల గేట్లు తెరిచేయడంతో.. ఓ లో స్కోరింగ్ మ్యాచ్‌లో అపురూప విజయాన్ని అందుకున్న పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది.

రోహిత్ ఆ బంతి ఎలా ఉంది..
అయితే ఈ ఓటమిని అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. మహమ్మద్ షమీని అయితే ఏకంగా పాకిస్థాన్‌కే వెళ్లాలని ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగా టీమిండియా ఓటమికి కారణమైన రోహిత్ శర్మపైనా అభిమానులు మండిపడుతున్నారు. ఈ దారుణ వైఫల్యంతో రోహిత్ భారత్ అభిమానులకే కాకుండా పాక్ ఫ్యాన్స్‌కు చులకన అయిపోయాడు. మ్యాచ్ జరుగుతుండగానే ఫీల్డింగ్ చేస్తున్న హిట్‌మ్యాన్‌ను పాకిస్థాన్ అభిమానులు ట్రోల్ చేశారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్‌ను.. అతను ఔటైన బంతిని గుర్తు చేస్తూ ఎగతాళి చేశారు. 'ఓయ్ రోహిత్.. ఆ బంతి ఎలా ఉందోయ్'అంటూ పదే పదే ప్రశ్నిస్తూ అతని ఏకగ్రాతను దెబ్బతీసే ప్రయత్నం చేశారు.

పాక్ ఫ్యాన్స్‌పై ఫైర్..
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే రోహిత్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరును క్రీడాభిమానులు తప్పుబడుతున్నారు. క్రికెట్‌లో దిగ్గజ బ్యాట్స్‌మన్ అయినటువంటి రోహిత్‌ను ఇలా ట్రోల్ చేయడం బాలేదని కామెంట్ చేస్తున్నారు. స్టార్ ఆటగాళ్లకు గౌరవం ఇవ్వాలని, 2019 వన్డే ప్రపంచకప్‌లో పాక్‌పై అతను ఆడిన ఇన్నింగ్స్ మరిచిపోయారా? అంటూ పాక్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?. ఇక టీమిండియా ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే షాహిన్ షా అఫ్రిది వేసిన నాలుగో బంతికి రోహిత్ ఎల్బీగా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ బంతి ఆడే క్రమంలో రోహిత్ లేజీగా ఉన్నట్లు అనిపించింది. ఆ తర్వాత రాహుల్, సూర్య కూడా ఔటవ్వడంతో భారత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

చిత్తుగా ఓడిన భారత్..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా...'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' షాహిన్ అఫ్రిది (3/31) దెబ్బ తీశాడు. అనంతరం పాక్ 17.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు మొహమ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా జట్టును గెలిపించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications