IND vs CSXI: సింగిల్ డిజిట్‌కే రోహిత్ శర్మ ఔట్.. వడాపావ్ మింగుపో అంటూ ఫ్యాన్స్ ఫైర్!

హైదరాబాద్: ఇంగ్లండ్ పర్యటనలో 20 రోజుల బ్రీఫ్ బ్రేక్ తర్వాత టీమిండియా సన్నాహకాలు షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు కౌంటీ ఎలెవన్‌తో వామప్ మ్యాచ్ ఆడుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, సీనియర్ బౌలర్లు అశ్విన్, షమీ, ఇషాంత్ దూరంగా ఉన్నారు. దాంతో రోహిత్ శర్మ జట్టును నడిపిస్తున్నాడు. టాస్ గెలిచిన హిట్ మ్యాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ(9) తీవ్రంగా నిరాశపరిచాడు. ఓవర్‌సీస్ గడ్డపై తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ మరోసారి సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. రెండు బౌండరీలు బాది టచ్‌లోకి వచ్చిన రోహిత్.. లిండన్ జేమ్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దాంతో భారత్ 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
విదేశాల్లో ఆడే సీన్ లేదు..
ఇక రోహిత్ శర్మ వైఫల్యంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్‌సీస్ గడ్డపై ఆడే సీన్ రోహిత్ శర్మకు లేదని, స్వదేశంలో మినహా అతను ఎక్కడా రాణించలేడని కామెంట్ చేస్తున్నారు. విదేశాల్లో ఓపెనర్లు రాణించడం చాలా ముఖ్యమని, మంచి ఆరంభాలు అందిన ప్రతీసారి భారత్ అద్భుత విజయాలు సాధించిందని గుర్తు చేస్తున్నారు. డబుల్ సెంచరీల వీరుడైన రోహిత్.. విదేశాల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా బాదలేడని కామెంట్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా రోహిత్ విఫలమయ్యాడని, అది భారత్ కొంపముంచిందని గుర్తు చేస్తున్నారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 34, 30 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
వడాపావ్ మింగుపో..
ఇంకొందరు రోహిత్ శర్మకు వడాపావ్ తినే టైమ్ అయిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు రోహిత్ శర్మ ఓవర్‌సీస్‌లో రాణించిందే లేదని, అతన్ని జట్టులో నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సత్తా చాటేందుకు యువ ఓపెనర్లు సిద్దంగా ఉన్నారని వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరైతే టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ వీడ్కోలు చెప్పాలని సూచిస్తున్నారు. రోహిత్‌కు ఇదే చివరి టెస్ట్ సిరీస్ అని ఒకరంటే.. విదేశాల్లో ఆడే సత్తా రోహిత్‌కు లేదని మరొకరు కామెంట్ చేశారు.
టాప్-3 విఫలం..
ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇండియా టాప్-3 బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(28),నయావాల్ చతేశ్వర్ పుజారా(21) చేతులెత్తేశారు. దాంతో 67 పరుగులకే రోహిత్ సేన మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(1 బ్యాటింగ్), హనుమ విహారీ(14 బ్యాటింగ్) ఉన్నారు. కౌంటీ ఎలెవన్ టీమ్‌లో లిండన్ జేమ్స్ రెండు వికెట్లు తీయగా.. జాక్ కార్సన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లయిన ఆవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుంధర్ కౌంటీ ఎలెవన్ టీమ్ తరఫున బరిలోకి దిగారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications