Virat Kohli Injury: ఫిట్‌నెస్ ఫ్రీక్ కోహ్లీకి గాయమా?.. ఎక్కడ దాక్కున్నారురా? రోహిత్ ఫ్యాన్స్ సెటైర్స్!

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌కు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. సరిగ్గా మ్యాచ్‌కు ముందు చివరి క్షణంలో అప్ప బ్యాక్ స్పామ్ ఇంజ్యూరితో తప్పుకున్నాడు. దాంతో కేఎల్ రాహుల్ తాత్కలిక సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. రాహుల్ సారథ్య బాధ్యతలు స్వీకరించడంతో ఈ మ్యాచ్‌లో యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఫిట్‌నెస్‌కు ప్రతిరూపంగా నిలిచే విరాట్ కోహ్లీ ఇలా గాయంతో మ్యాచ్‌కు దూరమవ్వడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఈ క్రమంలోనే అభిమానులు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా విరాట్ దూరమవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే విరాట్ అభిమానులను టార్గెట్ చేస్తూ సెటైర్లు పేల్చుతున్నారు.
ఎక్కడ దాక్కున్నారురా?
సౌతాఫ్రికా పర్యటనకు ముందు ముంబై వేదికగా నిర్వహించిన ప్రాక్టీస్ క్యాంప్‌లో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ తొడకండరాల గాయానికి గురయ్యాడు. దాంతో టెస్ట్ సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవలే వన్డే సారథిగా ఎంపికైన రోహిత్ శర్మను విరాట్ అభిమానులు గాయం నేపథ్యంలో ట్రోల్ చేశారు. అన్‌ఫిట్ రోహిత్ ఎప్పుడూ ఇలానే గాయాలతో సతమతమవుతాడని, అతనికి కెప్టెన్సీ ఇవ్వడం ఘోర తప్పిదమని విమర్శించారు. వన్డే సిరీస్‌కు కూడా దూరమవడంతో రోహిత్ మొత్తం ఎన్‌సీఏకే పరిమితమవుతాడని ఘాటుగా విమర్శించారు. ఇక ఇప్పుడు కోహ్లీ సైతం గాయపడటంతో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ రివేంజ్ తీసుకుంటున్నారు. ఫిట్‌నెస్ ఫ్రీక్.. గాయమెరుగని కోహ్లీ.. అని పెద్దపెద్ద మాటలు మాట్లాడిన వాళ్లు ముఖాలు ఎక్కడ దాచుకున్నారురా? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
నమ్మలేకపోతున్నాం..
గాయంతో విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్‌కు దూరమవ్వడం అస్సలు నమ్మలేకపోతున్నామని, ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ లేని మ్యాచ్‌లో మజా ఉండదని, అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కోహ్లీ సెంచరీ నిరీక్షణ కొనసాగుతూనే ఉందని, అంతేకాకుండా 100వ టెస్ట్ కూడా మరింత ఆలస్యం కానుందన్నాడు. విరాట్ కోహ్లీ గణంకాలు నమ్మలేకున్నా.. అతని రాత మాత్రం మరింత నమ్మలేని స్థితిలో ఉందని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. ఈ ఏడాది జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్‌కే కోహ్లీ దూరమవ్వడం దారుణమని మరొకరి కామెంట్ చేస్తున్నారు.
కోహ్లీ లేకున్నా..
విరాట్ కోహ్లీ లేకున్నా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్‌పీ సింగ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం భారత్ మంచి ఫామ్‌లో ఉందని ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ మాత్రం కోహ్లీ గైర్హాజరీ సౌతాఫ్రికాకు కలిసొచ్చే అంశమని తెలిపాడు. బ్యాటింగే కాకుండా కెప్టెన్‌గా దూకుడు నిర్ణయాలు తీసుకునే కోహ్లీ.. ఆడకపోవడం ఆ జట్టుకు హెల్ప్ అవుతుందన్నాడు.
విహారికి చాన్స్
ఇక టాస్ గెలిచిన వైస్ కెప్టెన్ రాహుల్.. పిచ్ పరిస్థితుల దృష్ట్యా బ్యాటింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడు. ప్రతీ భారత ఆటగాడికి జట్టుకు నాయకత్వం వహించడమనేది ఓ కలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు. భారీ స్కోర్ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టేందుకు ప్రయత్నిస్తామన్నాడు. అప్పర్ బ్యాక్ స్పామ్‌తో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని చెప్పిన రాహుల్.. అతని స్థానంలో హనుమ విహారి జట్టులోకి వచ్చాడని, అంతకుమించి ఎలాంటి మార్పులు చోటేచేసుకోలేదని స్పష్టం చేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఫిజియోల సూచనలతోనే ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని, మూడో టెస్ట్‌కు అందుబాటులోకి వస్తాడని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications