
జట్టుకు కావాల్సింది ఇదే..
ముఖ్యంగా టాప్ 3 బ్యాట్స్‌మెన్ విఫలమైన వేళ అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్న కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్‌లపై ప్రశంసించాడు. చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన దీపక్ హుడాను కొనియాడాడు. ఇక బౌలింగ్‌లో విండీస్ పతనాన్ని శాసించిన ప్రసిధ్ కృష్ణను మెచ్చుకున్నాడు. ‘సిరీస్ గెలవడం ఎప్పుడూ సంతోషమే. ఈ రోజు మేం కొన్ని కఠిన సవాళ్లు ఎదుర్కొన్నాం. కేఎల్ రాహుల్, సూర్య నెలకొల్పిన భాగస్వామ్యం అద్భుతం. మా జట్టుకు కావాల్సింది ఇలాంటి ఇన్నింగ్స్‌లే. చివరకు పోరాడే లక్ష్యాన్ని అందుకున్నాం.

సూర్య సూపరో సూపర్..
బంతితో అసాధారణ ప్రదర్శన కనబర్చాం. సమష్టిగా రాణించి విజయాన్నందుకున్నాం. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాధ్యత తీసుకొని బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యం. సూర్య ఈ రోజు ఆడిన ఇన్నింగ్స్ అతని ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. బ్యాటింగ్‌కు పిచ్ అంత అనుకూలంగా లేదు. దాంతో రాహుల్, సూర్య తమ కోసం కాకుండా జట్టు కావాల్సిన రీతీలో ఆడారు. చివర్లో హుడా ఇన్నింగ్స్ కూడా జట్టుకు హెల్ప్ అయింది. ఏదైనా కొత్తగా చేద్దామనే ఉద్దేశంతోనే రిషభ్ పంత్‌ను ఓపెనర్‌గా ఆడించాం. అయితే ఇది శాశ్వతం కాదు.

కొన్నిసార్లు విఫలమవచ్చు..
తదుపరి వన్డేకు శిఖర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అతనికి కొంచెం గేమ్ టైట్ అవసరం. ఫలితాలను ఆశించి ఇలాంటి ప్రయోగాలు చేయం. లాంగ్ టర్మ్ గోల్స్‌ను దృష్టిలో పెట్టుకొనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. ఈ విధానంలో కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు ఎదురవ్వచ్చు. ఇక మ్యాచ్‌లో డ్యూ ప్రభావం లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా రోజులుగా టీమిండియా బౌలింగ్‌లో ఇంత మంచి స్పెల్ చూసిందిలేదు. ప్రసిధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని స్కిల్, పేస్‌ను నమ్ముకొని ఎఫర్ట్ పెట్టాడు'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

టాప్-3 విఫలమైనా..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (83 బంతుల్లో 64; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం వెస్టిండీస్ 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. షామర్ బ్రూక్స్ (64 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ప్రసిధ్ కృష్ణ (4/12) ప్రత్యర్థిని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0తో గెలుచుకోగా, రేపు చివరి వన్డే జరుగుతుంది.


Click it and Unblock the Notifications
