Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాలుగో వన్డేకు ముందు గల్లీ క్రికెట్‌ ఆడిన రోహిత్ శర్మ(వీడియో)

Rohit Sharma enjoys gully cricket ahead of India vs West Indies 4th ODI

హైదరాబాద్: వెస్టిండీస్‌తో నాలుగో వన్డేకి ముందు రోహిత్ శర్మ కాసేపు ముంబయిలో గల్లీ క్రికెట్ ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారత్, వెస్టిండీస్ మధ్య ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈరోజు నాలుగో వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో.. నగరానికి చేరుకున్న రోహిత్ శర్మ.. ఆదివారం ఇంటి నుంచి ప్రాక్టీస్ సెషన్‌కి వెళుతూ.. మధ్యలో కారు ఆపి ఈ గల్లీ క్రికెట్ ఆడినట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియా‌తో టెస్టు సిరీస్‌ కోసం

ఆస్ట్రేలియా‌తో టెస్టు సిరీస్‌ కోసం

వెస్టిండీస్‌తో గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో 152 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత రెండు వన్డేల్లోనూ సింగిల్ డిజిట్‌కే ఔటైపోయాడు. దీంతో.. బ్రబౌర్న్‌ స్టేడియంలో ఈ హిట్‌మ్యాన్ ఎలా రాణిస్తాడో..? అని ఆసక్తి నెలకొంది. ఇటీవల ఆస్ట్రేలియా‌తో టెస్టు సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో రోహిత్ శర్మకి సెలక్టర్లు చోటిచ్చిన విషయం తెలిసిందే.

ఫామ్‌ను దక్కించుకునేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్న ధోనీ

మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు రావడంతో

ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత ఐదు రోజుల ఫార్మాట్‌కి దూరమైన రోహిత్ శర్మ.. మళ్లీ సెలక్టర్ల నుంచి టెస్టుల కోసం పిలుపు రావడంతో ఇప్పుడు తెగ ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఇదే క్రమంలో ఇంతకుముందు టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సమయంలోనూ జట్టులో స్థానం కల్పిస్తే టెస్టుల్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

ముంబై వేదికగా నాలుగో వన్డే

ముంబై వేదికగా నాలుగో వన్డే

ముంబై వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య 4వ వన్డే ప్రారంభమైంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో నాలుగో వన్డే మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.

రెండు ప్రధాన మార్పులకు తావిస్తూ:

రెండు ప్రధాన మార్పులకు తావిస్తూ:

రిషబ్ పంత్, స్పిన్నర్ చాహల్‌పై వేటు వేసి రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్‌లకు జట్టు మేనేజ్‌మెంట్ చోటు కల్పించింది. సిరీస్ అవకాశాలను నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిందే. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేల ముగియగా ఇరు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి.

Story first published: Monday, October 29, 2018, 14:33 [IST]
Other articles published on Oct 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+