కోహ్లీతో బ్యాటింగ్ భలే ఉంటాది.. ఆ గోల ఉంటేనే మజా: రోహిత్ శర్మ
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ వార్తలను ఖండించాడు. తన మనసులో అసలు రిటైర్మెంట్ ఆలోచనే లేదని స్పష్టం చేశాడు. టీమిండియాకు వన్డే ప్రపంచకప్ అందించడమే తన ఏకైక లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 138) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడిన రోహిత్ శర్మ.. రిటైర్మెంట్ అవుతున్నాడనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా లార్డ్స్ వన్డేనే అతనికి చివరి మ్యాచ్ అని ప్రచారం సాగింది. 2027 వన్డే ప్రపంచకప్ నుంచి రోహిత్ శర్మను సెలెక్టర్లు తప్పించారని, ఈ విషయం అతనికి కూడా చెప్పారని వార్తలు వచ్చాయి.

ఈ ప్రచారాన్ని రోహిత్ శర్మ విధ్వంసకర శతకంతో తిప్పకొట్టాడు. మూడో వన్డే అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన హిట్ మ్యాన్.. రిటైర్మెంట్ ప్రచారం ఉంటేనే అసలు మజా ఉంటుందని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీతో బ్యాటింగ్ చేయడం భలే సరదాగా ఉంటుందని తెలిపాడు.
ఆ గోల ఉంటేనే మజా..
'దేశానికి ప్రాతినిథ్యం వహించడం, బ్యాట్‌తో సత్తా చాటడమే నా పని. అరంగేట్రం చేసినప్పటి నుంచి నేను ఇదే చేస్తున్నా. చాలా రోజులుగా నా రిటైర్మెంట్‌పై ఊహాగానాలు, పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. నేను ఆడుతున్నంత కాలం ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఈ పుకార్లను నేను అస్సలు పట్టించుకోను. మైదానంలో నేను ఎలా ఆడుతున్నాన్నదే ముఖ్యం. జట్టు విజయానికి నా వంతు సహకారం అందించడానికి ప్రయత్నిస్తాను. నా దృష్టి అంతా ఇప్పుడు దానిపై ఉంది. అయినా అలాంటి ప్రచారం లేకపోతే మజా ఉండదు.
కోహ్లీతో బ్యాటింగ్ భలే ఉంటాది..
విరాట్ కోహ్లీతో బ్యాటింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. మేం మా కెరీర్ అంతా కలిసి ఆడాం. మైదానంలో అతను నాతో ఉండటం మంచి అనుభూతినిస్తోంది. ఇప్పటికే మేం ఎన్నో భాగస్వామ్యాలు నెలకొల్పాం. ఒకరినొకరం బాగా అర్థం చేసుకొని ఆడుతాం. మైదానంలో మా ఆలోచనలు పంచుకుంటూ జట్టు కోసం ఏం చేయాలనే దానిపై చర్చించుకుంటాం. మూడో వన్డేలో విజయం కోసం మా జట్టు ఆఖరి వరకు పోరాడింది. కానీ 27 పరుగు తేడాతో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. భారత్ చెత్త బౌలింగ్‌తో 387 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. అనంతరం భారత్ 360 పరుగులే చేసి ఓటమిపాలైంది. రోహిత్ శర్మ(138) భారీ శతకంతో చెలరేగినా.. శుభ్‌మన్ గిల్(77), విరాట్ కోహ్లీ(74) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

