ఇదొక్కటే మార్గం.. ఇంకో ఆప్షన్ లేదు: రోహిత్ శర్మ

ముంబై: దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో సురక్షితంగా ఉండాలంటే ఇంటికి పరిమితం కావాల్సిందేనని, మరో మార్గం లేదని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ సూచించాడు. ఈ ప్రాణాంతక మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా క్రీడా టోర్నీలన్నీ రద్దైన విషయం తెలిసిందే. దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో ఇండ్లకే పరిమితమైన క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇంతకన్నా ఏం చేయలేం..
ఈ నేపథ్యంలో రోహిత్.. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. బాల్కానీలో కూర్చోని షూ లేస్ కట్టుకుంటున్న ఫొటోకు ‘ఇంట్లో ఉండటం తప్ప వేరే మార్గం లేదు. ఇంట్లో ఉండండి.. ఫిట్‌గా ఉండండి.. సేఫ్‌గా ఉండండి'అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పటికే టీమ్ఇండియా ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ నిర్వహించిన హిట్‌మ్యాన్ తాజాగా అభిమానులకు ఇంట్లోనే ఉండమని సూచించాడు.

మీడియాపై ఫైర్..
ఈ లైవ్ సెషన్ సందర్భంగా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పట్ల మీడియా అతిగా ప్రవర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతన్ని నిశితంగా పరిశీలిస్తూ విమర్శలు గుప్పిస్తుందని, వార్తలు రాసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని మందలించాడు. ఇక యువ క్రికెటర్లు ఆడే ప్రతీ మ్యాచ్ జీవితంలో చివరిదనుకోవాలని సూచించాడు. యువరాజ్ తన మొదటి 'క్రికెట్ క్రష్' అని కూడా వెల్లడించాడు.

నెల రోజుల పాటు 5 వేల మందికి సచిన్ సాయం..
కరోనా సంక్షోభ సమయంలో 5వేల మంది పేద ప్రజలకు సాయం చేసేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముందుకొచ్చాడు. నెల రోజుల పాటు 5వేల మందికి నిత్యావసరాలు అందించేందుకు గాను అప్నాలయ అనే స్వచ్ఛంద సంస్థకు మాస్టర్ చేయూతనిచ్చాడు. దీంతో సచిన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ సంస్థ ట్వీట్ చేయగా.. మాస్టర్స్పందించాడు. "అభాగ్యులు, ఇబ్బందుల్లో ఉన్న వారికి సేవలను కొనసాగించేందుకు అప్నాలయకు మరింత మంచి జరగాలని కోరుకుంటున్నా. మంచి పనిని కొనసాగించండి" అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. కరోనాపై యుద్ధం కోసం సచిన్ ఇప్పటికే రూ.50లక్షలను విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. చెరో రూ.25లక్షలను పీఎం సహాయ నిధి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications