Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగుల మైలురాయి అందుకున్న నాలుగో భారత ప్లేయర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాతో వైజాగ్ వేదికగా శనివారం జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. భారత బ్యాటింగ్ సందర్భంగా కేశవ్ మహారాజ్ వేసిన 14వ ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి ఈ ఘనతను అందుకున్నాడు.

ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ (27,910), రాహుల్ ద్రవిడ్(24,064) రోహిత్ శర్మ కంటే ముందున్నారు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రోహిత్.. 67 టెస్ట్‌ల్లో 4301, టీ20ల్లో 4,231 పరుగులు, వన్డేల్లో 11,491 పరుగులు చేశాడు.

యశస్వి జైస్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 155 పరుగులు జోడించిన రోహిత్ శర్మ.. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. సౌతాఫ్రికాపై ఇది 10వ 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం కాగా.. 12 ఏళ్ల తర్వాత ఈ ఫీట్ నమోదు కావడం గమనార్హం.

Rohit Sharma Creates History Joins Elite Batting Club Featuring Virat Kohli Sachin Tendulkar and Rahul Dravid

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. క్వింటన్ డికాక్(89 బంతుల్లో 6 ఫోర్లతో 106) సెంచరీతో చెలరేగగా.. టెంబా బవుమా(67 బంతుల్లో 5 ఫోర్లతో 48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌, ప్రసిధ్ కృష్ణ నాలుగేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.

అనంతరం భారత్ 44 ఓవర్లలో వికెట్ నష్టానికి పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. యశస్వి జైస్వాల్(116 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 107) సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57), రోహిత్ శర్మ(73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ ఒక్కడే వికెట్ తీయగా మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.

Story first published: Saturday, December 6, 2025, 20:13 [IST]
Other articles published on Dec 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+