For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. కని విని ఎరుగని రికార్డ్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. మరే ఆటగాడు కూడా అతనికి దరిదాపుల్లో లేరు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన రోహిత్ శర్మ 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. 19 బంతుల్లోనే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

Rohit Sharma Creates History Becomes First Player In The World To Hit 200 sixes in T20Is

రోహిత్@200
అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మ 157 మ్యాచ్‌లు ఆడి 203 సిక్స్‌లు బాదాడు. రోహిత్ శర్మ తర్వాత మార్టిన్ గప్టిల్(173), జోస్ బట్లర్(137), గ్లేన్ మ్యాక్స్‌వెల్(133), నికోలస్ పూరన్(132), సూర్యకుమార్ యాదవ్(131) ఉన్నారు.

గేల్ రికార్డ్ బద్దలు..
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే దేశంపై అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డ్‌ను రోహిత్ శర్మ అధిగమించాడు. క్రిస్ గేల్ మూడు ఫార్మాట్లలో కలిపి ఇంగ్లండ్‌పై 130 సిక్స్‌లు బాదగా.. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై 132 సిక్స్‌లు బాదాడు. మరే ఆటగాడు కూడా ఈ ఫీట్‌కు దగ్గరగా లేరు.

Rohit Sharma Creates History Becomes First Player In The World To Hit 200 sixes in T20Is

అత్యధిక వ్యక్తిగత స్కోర్..
టీ20 ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ శర్మ అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. 2010లో ఆస్ట్రేలియాపై 79 పరుగులతో అజేయంగా నిలిచిన రోహిత్.. తాజాగా 92 పరుగులు చేసి తన వ్యక్తిగత రికార్డ్‌ను మెరుగుపరుచుకున్నాడు. దాంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన రెండో భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

సురేశ్ రైనా (101)టాప్‌లో ఉండగా.. విరాట్ కోహ్లీ(89 నాటౌట్) తర్వాతి స్థానంలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన కెప్టెన్‌గానూ రోహిత్ రికార్డు సాధించాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్(98)టాప్‌లో ఉండగా.. రోహిత్ శర్మ(92), గేల్(88), కేన్ విలియమ్సన్(85) ఉన్నారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ రోహిత్ నిలిచాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్‌లను అతను వెనక్కినెట్టాడు.

రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో టీమిండియా 205 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అతనికి తోడుగా సూర్యకుమార్ యాదవ్(31), హార్దిక్ పాండ్యా(27 నాటౌట్) రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినీస్ రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Monday, June 24, 2024, 22:00 [IST]
Other articles published on Jun 24, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+