
బెంగళూరు: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. శ్రీలంకపై సాధించిన టెస్ట్ సిరీస్ విజయం ద్వారా కెప్టెన్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. మూడు ఫార్మాట్లలో ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఫస్ట్ సిరీస్‌ల్లోనే క్లీన్ స్వీప్ విజయాలు అందుకున్న తొలి సారథిగా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన గులాబీ టెస్ట్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను రోహిత్ సేన 2-0తో కైవసం చేసుకుంది. టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇదే ఫస్ట్ సిరీస్.
సౌతాఫ్రికా పర్యటనలో భారత సిరీస్ ఓటమి అనంతరం టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. దాంతో సారథిగా అతని శకం ముగియగా.. అప్పటికే పరిమిత ఓవర్ల సారథిగా ఉన్న రోహిత్ శర్మకు టీమిండియా ఫుల్ టైమ్ కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది. ఇక ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడిన భారత్.. ఈ రెండు సిరీస్‌లను 3-0తో క్లీన్ స్వీప్ చేసుకుంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 3-0తో గెలిచింది. తాజాగా టెస్ట్ సిరీస్‌ను కూడా 2-0తో గెలవడంతో కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ అరుదైన గుర్తింపు దక్కింది.
పింక్ బాల్ టెస్ట్‌లో 447 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 208 పరుగులకే కుప్పకూలింది. లంక్ కెప్టెన్ దిముత్ కరుణ రత్నే(174 బంతుల్లో 15 ఫోర్లతో 107) సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. కుశాల్ మెండీస్(60 బంతుల్లో 8 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు రెండు, రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది. ఇక సొంతగడ్డపై భారత్‌కు ఇది వరుసగా 15వ టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం.
భారత్ తొలి ఇన్నింగ్స్ 252 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 92)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 109 ఆలౌట్ ( మాథ్యూస్ 43, బుమ్రా 5/24)
భారత్ రెండో ఇన్నింగ్స్ 303/9 డిక్లెర్డ్ (రిషభ్ పంత్ 50, శ్రేయస్ అయ్యర్ 67)
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 208 ఆలౌట్( దిముత్ కరుణ రత్నే 107, కుశాల్ మెండీస్ 54)