టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతూనే ఐసీసీ మెగా టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి రోహిత్ శర్మను ప్రచారకర్తగా ఐసీసీ నియమించడంతో హిట్‌మ్యాన్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. గతంలో 2011 వన్డే ప్రపంచకప్‌కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. సచిన్ ఆ టోర్నీ ఆడుతూనే ప్రచారకర్తగా వ్యవహరించాడు.
టీ20 ప్రపంచ కప్ చరిత్రలో మాత్రం రోహిత్ శర్మ ఒక్కడే ఈ ఫీట్ సాధించాడు. మరే ఆటగాడు కూడా ఈ ఘనతను అందుకోలేదు. అంతేకాకుండా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన నాలుగో భారత ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ నిలిచాడు. గతంలో యువరాజ్ సింగ్(2024 టీ20 ప్రపంచకప్), మహేంద్ర సింగ్ ధోనీ(2021 టీ20 ప్రపంచకప్), సచిన్ టెండూల్కర్(2016 టీ20 ప్రపంచకప్) ప్రచారకర్తలుగా వ్యవహరించారు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ షెడ్యూల్ గత మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకటన కార్యక్రమానికి ఐసీసీ ఛైర్మెన్ జైషాతో పాటు రోహిత్ శర్మ, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, భారత మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ మెగా టోర్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు జై షా ప్రకటించారు. 9 టీ20 ప్రపంచకప్‌లు ఆడిన రోహిత్ శర్మ కంటే గొప్ప రాయబారి ఎవరూ లేరని జై షా కొనియాడారు. రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నారు.
'భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ టోర్నీకి రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్ టీమ్ సారథి కావడంతో పాటు గత 9 టీ20 ప్రపంచకప్‌లు ఆడిన రోహిత్ శర్మ కంటే గొప్ప బ్రాండ్ అంబాసిడర్ మరొకరు లేరు.'అని జై షా ట్వీట్ చేశారు.
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. అమెరికాతో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ముంబై వేదికగా ఫిబ్రవరి 7న ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్, పాకిస్థాన్‌తో పాటు నమీబియా, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. దాయాదుల పోరు ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది.
2007 టీ20 ప్రపంచకప్- జాక్వెస్ కల్లిస్(సౌతాఫ్రికా)
2009 టీ20 ప్రపంచకప్- కోలిన్ క్రోఫ్ట్ (వెస్టిండీస్), నాసిర్ హుస్సేన్ (ఇంగ్లండ్)
2010 టీ20 ప్రపంచకప్- సర్ వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)
2012 టీ20 ప్రపంచకప్- ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక)
2014 టీ20 ప్రపంచకప్- బంగ్లాదేశ్ ప్లేయర్స్ & సచిన్ టెండూల్కర్ (యూనిసెఫ్ గ్లోబల్ అంబాసిడర్‌గా)
2016 టీ20 ప్రపంచకప్- సచిన్ టెండూల్కర్ (భారత్)
2021 టీ20 ప్రపంచకప్- మహేంద్ర సింగ్ ధోనీ (భారత్)
2022 టీ20 ప్రపంచకప్- షేన్ వాట్సన్ & మైఖేల్ హస్సీ(ఆస్ట్రేలియా)
2024 టీ20 ప్రపంచకప్- యువరాజ్ సింగ్(భారత్)
2026 టీ20 ప్రపంచకప్- రోహిత్ శర్మ(భారత్)