Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: శుభ్‌మన్ గిల్‌‌ కోలుకోలేదు.. అదే మా ఆయుధం!

చెన్నై: డెంగ్యూ బారిన పడిన టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇంకా కోలుకోలేదని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతను ఫిట్‌గా లేడని, టీమిండియా మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తుందని చెప్పాడు. హై ఫీవర్‌తో బాధపడుతున్న శుభ్‌మన్ గిల్ ఆడటంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

అతనికి టీమ్‌మేనేజ్‌మెంట్ కోలుకునే సమయం ఇస్తుందని, మ్యాచ్ రోజు మెడికల్ టీమ్ అప్‌డేట్ ప్రకారం తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు అక్కడికి చేరి ముమ్మరంగా సాధన చేస్తున్నాయి.

 Rohit Sharma

అయితే డెంగ్యూ బారిన పడిన శుభ్‌మన్ గిల్.. ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదు. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచిన అతను డెంగ్యూ బారిన పడటం అభిమానులను కలవరపాటుకు గురి చేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన శుభ్‌మన్ గిల్ తొలి మ్యాచ్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.

హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం శుభ్‌మన్ గిల్‌ ఇంకా తొలి మ్యాచ్‌కు అందుబాటులోనే ఉన్నాడని, మెడికల్ టీమ్ అతన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందని చెప్పాడు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ద్రవిడ్.. ప్రస్తుతం గిల్ బాగానే ఉన్నాడని, మ్యాచ్ సమయానికి ఫిట్ అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఆసీస్‌తో ప్రపంచకప్ తొలి మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్‌ శర్మను శుభ్‌మన్ గిల్ గురించి ప్రశ్నించగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతను అనారోగ్యంగానే ఉన్నాడని, మ్యాచ్‌ ప్రారంభానికి ముందు తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు.

'శుభ్‌మన్ గిల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతను చాలా సిక్ అయ్యాడు. టీమిండియా మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తోంది. గిల్ ఇంకా జట్టుకు అందుబాటులోనే ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ హై ఫీవర్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కెప్టెన్‌గా కాకుండా ఓ మనిషిగా అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.

అతను కుర్రాడు.. పైగా ఫిట్‌గా ఉండే వ్యక్తి. ఈ హై ఫీవర్ నుంచి త్వరగానే కోలుకుంటాడు. ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు మేం అన్ని విధాలుగా సిద్దమయ్యాం. టీమ్ మూడ్ కూడా బాగుంది. ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. గతంలో మేం ఏం చేశామనేది ఇక్కడ అనవసరం. ఆస్ట్రేలియా బలమైన జట్టు. ప్రపంచకప్‌ల్లో ఎంత ప్రమాదకరంగా ఆడుతుందో మాకు తెలుసు.

మేం మా బలాలపై మాత్రమే ఫోకస్ పెట్టాలనుకుంటున్నాం. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్, చేయడం.. లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంపైనే దృష్టిసారించాం. మెగా టోర్నీలో ప్రతీది కీలకమే'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

డెంగ్యూ బారిన పడితే ప్లేట్ల‌లేట్స్ తగ్గి చాలా నిరసంగా మారుతారు. ఒకవేళ శుభ్‌‌మన్ గిల్ కోలుకున్నా అతనికి తొలి రెండు మ్యాచ్‌లు విశ్రాంతి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పెద్ద టోర్నీ నేపథ్యంలో టీమిండియా.. శుభ్‌మన్ గిల్ విషయంలో ఏ మాత్రం రిస్క్ చేయదు. శుభ్‌మన్ గిల్ దూరమైతే.. రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.

Story first published: Saturday, October 7, 2023, 16:18 [IST]
Other articles published on Oct 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+