
ఓవల్: టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నిలకడగా బ్యాటింగ్ చేసిన రోహిత్ (56 బంతుల్లో 2 ఫోర్లతో 20 బ్యాటింగ్).. అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన 8వ భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 34,357 రన్స్‌తో టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, మహమ్మద్ అజారుద్దీన్ రోహిత్ కన్నా ముందున్నారు. ఓవరాల్‌గా 15వేల మైలురాయి ధాటిన జాబితాలో 39వ స్థానంలో నిలిచాడు. ఇక రోహిత్ మెజార్టీ పరుగులు వన్డేల్లో చేసినవే. 227 మ్యాచ్‌ల్లో 9,205 పరుగులు చేసిని హిట్ మ్యాన్.. 43 టెస్ట్‌ల్లో 2935, 111 టీ20ల్లో 2864 రన్స్ చేశాడు.
ఇక అత్యంత వేగవంతంగా 15 వేల క్లబ్‌లో చేరిన ఐదో బ్యాట్స్‌మన్‌గా కూడా హిట్ మ్యాన్ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. సచిన్ ద్రావిడ్, సెహ్వాగ్ రోహిత్ కన్నా ముందున్నారు. కోహ్లీ 333 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. సచిన్ 356, ద్రవిడ్ 368, సెహ్వాగ్ 371 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నారు. రోహిత్ శర్మ మాత్రం 397 ఇన్నింగ్స్‌ల్లో 15 వేల క్లబ్‌లో చేరాడు.
భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ జోరు కొనసాగుతోంది. తొలి రోజు బౌలింగ్‌లో దుమ్మురేపిన ఆతిథ్య జట్టు రెండో రోజు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. కీలక వికెట్లు త్వరగా కోల్పోయినా.. లోయరార్డర్, లోయర్ మిడిలార్డ్ రాణించడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 99 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమాయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్(41 బంతుల్లో 4 ఫోర్లతో 22 నాటౌట్) ఉన్నారు. అండర్సన్ వేసిన మూడో ఓవర్‌లో రోహిత్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను సెకండ్ స్లిప్‌లో రోరీ బర్న్స్ నేలపాలు చేశాడు. దాంతో రోహిత్ బచాయించాడు. అప్పుడు హిట్ మ్యాన్ వ్యక్తిగత స్కోర్ 6.
అంతకుముందు 53/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 290 పరుగులకు ఆలౌటైంది. దాంతో జోరూట్ సేన 99 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఓలి పోప్(159 బంతుల్లో6 ఫోర్లతో 81), క్రిస్ వోక్స్(58 బంతుల్లో11 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. బెయిర్ స్టో(37), మొయిన్ అలీ(35), డేవిడ్ మలాన్(31) కీలక భాగస్వామ్యాలు అందించారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్, శార్దూల్‌కు చెరొక వికెట్ దక్కింది.