For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: రిషభ్ పంత్‌ను తిట్టిన రోహిత్ శర్మ(వీడియో)

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి సహనం కోల్పోయాడు. న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు డ్రెస్సింగ్ రూమ్‌లో క్లాస్ పీకాడు. ఏదో విషయం గురించి ఈ ఇద్దరి చర్చించుకోగా.. రోహిత్ గట్టిగా అరుస్తూ పంత్‌కు చివాట్లు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటా? అనేది క్లారిటీ లేదు. తొలి రోజు ఆట అనంతరం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. హోమ్ గ్రౌండ్‌లో 18 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఈ ఫ్రస్టేషన్‌లోనే పంత్‌ను తిట్టాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Rohit Sharma caught scolding Rishabh Pant in dressing room during IND vs NZ 3rd Test Video

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్(138 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), డారిల్ మిచెల్(129 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81) న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. ఆకాశ్‌దీప్ ఓ వికెట్ తీసాడు. అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్(146 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 90) తృటిలో శతకం చేజార్చుకోగా.. రిషభ్ పంత్(59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు.

దూకుడుగా ఆడిన వాషింగ్టన్ సుందర్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో అతనికి సహకారం లభించకపోవడంతో హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్(5/103) ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. మ్యాట్ హెన్రీ, గ్లేన్ ఫిలిప్స్, ఇష్ సోధీకి తలో వికెట్ దక్కింది. భారత్‌కు 28 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. డారిల్ మిచెల్, విల్ యంగ్ ఆచితూచి ఆడుతున్నారు.

Story first published: Saturday, November 2, 2024, 16:08 [IST]
Other articles published on Nov 2, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+