Rohit Sharma బరువు తగ్గడంపై పేలుతున్న సైటర్లు! పొట్ట కవర్ చేస్తున్నాడంటూ..!

న్యూఢిల్లీ: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో తలపడే జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాడు. విండీస్‌తో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. రోహిత్ బుధవారం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు. ఆ తర్వాతే సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేస్తుంది.
తొడ కండరాల గాయంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్.. ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా దృష్టి సారించాడు. వైద్యుల సూచనల మేరకు ఏకంగా 6 కిలోల బరువు తగ్గాడు. దాంతో హిట్ మ్యాన్ చాలా ఫిట్‌గా, బక్కగా కనిపిస్తున్నాడు. ఇటీవలే తన న్యూలుక్ సంబంధించిన ఫొటోలను రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
పొట్టను కవర్ చేస్తూ..
అయితే రోహిత్ బరువు తగ్గడంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. బొద్దుగా ఉండే రోహిత్ శర్మ సన్నగా అయ్యాడంటే నమ్మలేకపోతున్నామని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే ఇదంతా ఫొటోల మాయేనని, రియల్‌గా చూస్తేగానీ నమ్మలేం అంటున్నారు. ఇంకొందరేమో కెమెరాల ముందు పొట్టను కవర్ చేయడానికి రోహిత్ శర్మ చాలా ఇబ్బంది పడుతున్నాడని, లోపలికి అదిమిపట్టి ఫోజులిస్తున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. దీనికి సబంధించిన ఫన్నీ వీడియోలను షేర్ చేస్తున్నారు.
ఇక విజయాలే..
CEAT టైర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రోహిత్.. ఆ కంపెనీకి సంబంధించిన ఫొటో షూట్‌లో ఇటీవల పాల్గొన్నాడు. వాటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. వడాపావ్ తినే రోహిత్ సన్నబడ్డాంటే నమ్మలేకపోతున్నామని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు రోహిత్ ఫ్యాన్స్ ఈ సెటైర్లను తిప్పికొడుతున్నారు. రోహిత్ ఫిట్‌గా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని బదులిస్తున్నారు. రోహిత్ రాకతో భారత జట్టు విజయాల బాట పడుతుందని కామెంట్ చేస్తున్నారు.
హార్దిక్ పాండ్యా రీఎంట్రీ..
వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టును సెలెక్టర్లు ఈ రెండు రోజుల్లో సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లు అశ్విన్, భువనేశ్వర్‌లకు అవకాశం ఇస్తారా? లేదా అన్నది ఆసక్తికరం. టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనకు తోడు... ఫిట్‌నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వెస్టిండీస్‌తో సిరీస్‌తో పునరాగమనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీసు చేస్తున్న అతడు రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. మూడు వన్డేలు (ఫిబ్రవరి 6, 9, 11) అహ్మదాబాద్‌లో, మూడు టీ20లు (ఫిబ్రవరి 16, 18, 20) కోల్‌కతాలో జరుగుతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications