రోహిత్.. ఇక నువ్వు గల్లీ క్రికెటే ఆడుకో.. కెప్టెన్ అయ్యాక నీకు కళ్లు నెత్తికెక్కాయి! మండిపడుతున్న ఫ్యాన్స్!

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం విశ్రాంతిలో రోహిత్ శర్మ.. ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం బుధవారం(జూన్ 16) ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో కనిపించలేదు. దాంతో అతను మళ్లీ గాయపడ్డాడా? అని అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే రోహిత్ ఫిట్‌గా ఉన్నాడని, సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఉన్న రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి హిట్ మ్యాన్ బయల్దేరుతాడని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నెల 20న రోహిత్‌తో పాటు పంత్, ద్రవిడ్, అయ్యర్ ఇంగ్లండ్‌కు పయనం కానున్నారు.
సెలవులు సరిపోలేదా?
అయితే రోహిత్ శర్మ ఆలస్యంగా వెళ్తుండటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన సెలవులు ఇంకా సరిపోలేదా? అని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆఖరి స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేదు. ప్లేఆఫ్స్‌కి ముందు హాలీడేస్ కోసం కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో వాలిపోయిన రోహిత్ శర్మ, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ముంబై వీధుల్లో గల్లీ క్రికెట్ ఆడుతూ కనిపించాడు.

విశ్రాంతే దండుగ..
ఇంగ్లండ్ టూర్ వెళ్లే టీమ్ అంతా బీసీసీఐ క్యాంపులో చేరితే, రోహిత్ శర్మ మాత్రం గల్లీ క్రికెట్ ఆడుతూ కనిపించడం చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఈ తరహా ప్రవర్తనతో ఉంటే ఇక నుంచి గల్లీ క్రికెటే ఆడుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మే 22 నుంచి క్రికెట్‌కి దూరంగా ఉన్న రోహిత్ శర్మ, టీమ్‌తో కలిసి వెళ్లకుండా సెపరేట్‌గా వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అసలు రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడమే అనవసరమని అభిప్రాయపడుతున్నారు. అసలు అతను తీరిక లేకుండా క్రికెట్ ఎప్పుడు ఆడాడని నిలదీస్తున్నారు.

కళ్లు నెత్తికెక్కాయా?
టీ20 ప్రపంచకప్ అనంతరం గాయంతో జట్టుకు దూరమైన రోహిత్ శర్మ.. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనేలేదు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లు ఆడాడు. ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగాడు. అంతే తప్పా పెద్దగా ఆడింది ఏం లేదు. ఇంత మాత్రానికే అతనికి విశ్రాంతి ఇవ్వడం అనవసరమంటున్నారు. కెప్టెన్ అయిన తర్వాత రోహిత్ శర్మ కళ్లు నెత్తికెక్కినట్లున్నాయని మండిపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications