Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: సఫారీ సవాల్‌కు హిట్ మ్యాన్ రెడీ.. ప్రాక్టీస్ షురూ (వీడియో)

Rohit Sharma begins preparation for South Africa tour

ముంబై: భారత వన్డే సారథిగా, టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్‌గా డబుల్ ప్రమోషన్ అందుకున్న రోహిత్ శర్మ.. సౌతాఫ్రికా పర్యటన కోసం ప్రాక్టీస్ షురూ చేశాడు. సఫారీ గడ్డపై సవాల్ విసిరే బౌన్సీ పిచ్‌లపై రాణించడంపై ఇప్పటి నుంచే దృష్టి సారించాడు. టెస్ట్ వైస్ కెప్టెన్‌గా తన ఫస్ట్ అసైన్‌మెంట్‌లోనే హిట్ కొట్టాలని చూస్తున్నాడు. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్న హిట్‌మ్యాన్.. సఫారీ పర్యటన కోసం స్పెషల్‌గా ప్రిపేర్ అవుతున్నాడు. సొంతంగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను రోహిత్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

ఇందులో ఎక్కువ బౌన్స్ అవుతున్న త్రో డౌన్స్‌ను ఎదుర్కొంటూ కనిపించాడు. పర్‌ఫెక్ట్ టైమింగ్‌తో వాటిని హిట్‌చేసిన రోహిత్.. ఆఫ్ స్టంప్‌కు దూరంగా పడ్డ బాల్స్‌ను వదిలేస్తున్నాడు. ఈ సెషన్‌ను చూస్తే.. సౌతాఫ్రికా పేసర్లు రబడా, అన్రిచ్ నోర్జ్, ఎంగిడిని ఫేస్ చేసేందుకు తను పక్కా ప్లాన్‌తో ప్రిపేర్ అవుతున్నట్టు అర్థం అవుతోంది. కాగా, చివరగా ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో రోహిత్ సూపర్ పెర్పామెన్స్ చేశాడు. ఇప్పుడు వైస్ కెప్టెన్సీతో బాధ్యత మరింత పెరగడంతో అతనిపై అంచనాలు పెరిగాయి. ఈ నెల 26 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో సౌతాఫ్రికాతో 3 టెస్ట్‌లు, 3 వన్డేలు ఉన్నాయి.

ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గత బుధవారం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తప్పించింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశంతో టీ20 సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మనే వన్డేలకు సారథిగా ఎంపిక చేసింది. ఈ నిర్ణయం పట్ల విరాట్ కోహ్లీ సుముఖంగా లేకున్నా అతని వన్డే కెప్టెన్సీ పీకేసింది. టీమిండియా వన్డే కెప్టెన్‌ బాధ్యతలు స్వీకరించనున్న రోహిత్ శర్మ.. తన కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. తనకు కోహ్లీ ఎప్పటికీ కెప్టెనేనని, అతని సేవలు భారత జట్టుకు అవసరమన్నాడు.

బ్యాక్ స్టేజ్ విత్ బోరియా షోలో మాట్లాడిన రోహిత్ శర్మ .. కోహ్లీకి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'విరాట్ కోహ్లీ వంటి నాణ్యమైన ఆటగాళ్లు జట్టుకు ఎంతో అవసరం. టీ20 ఫార్మాట్‌లో 50 ప్లస్ యావరేజ్ అనేది మాములు విషయం కాదు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీ భారత్‌ను గెలిపించాడు. అతని అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కోహ్లీ క్వాలిటీ, బ్యాట్స్‌మన్‌షిప్ టీమ్‌ను మరోస్థాయికి చేర్చుతుంది.

ఇప్పటికీ అతను జట్టులో కెప్టెన్‌గానే భావిస్తా. అలాంటి సారథిని కోల్పోవడానికి ఏ కెప్టెన్ కూడా ఇష్టపడడు. జట్టులో అతను ఉండటం ఎంతో అవసరం. ఇక ఆటగాడిగా ఎన్ని సెంచరీలు బాదినా.. పరుగులు చేసినా చాంపియన్‌షిప్ గెలవడమే ముఖ్యం. అయితే టైటిల్ గెలవాలంటే ఒక్కడి వల్ల సాధ్యం కాదు. జట్టుగా రాణించాల్సిందే.'అని హిట్ మ్యాన్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Saturday, December 11, 2021, 12:17 [IST]
Other articles published on Dec 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+